Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్ ఎక్కడున్నారు? దాడులపై ఆయన స్పందించాలి : హిల్లరీ క్లింటన్

దేశంలో జరుగుతున్న జాత్యహంకార దాడులపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించాలని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ డిమాండ్ చేశారు. ఈ దాడుల కారణంగా అమెరికాలోని ప్రవాసీయులంతా భయాందోళనల్లో ఉన్నార

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (09:53 IST)
దేశంలో జరుగుతున్న జాత్యహంకార దాడులపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించాలని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ డిమాండ్ చేశారు. ఈ దాడుల కారణంగా అమెరికాలోని ప్రవాసీయులంతా భయాందోళనల్లో ఉన్నారనీ, ఇలాంటి సమయాల్లో అధ్యక్షుడు వారికి అండగా నిలబడాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
శ్వేత‌జాతీయుడు ప్యూరింట‌న్ జ‌రిపిన కాల్పుల్లో హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ‌నివాస్ కూచిభొట్ల మృతి చెందాడు. ఇదే దాడిలో మ‌రో తెలుగు యువ‌కుడు అలోక్ గాయ‌ప‌డ్డాడు. దీనిపై హిల్లరీ క్లింటన్ స్పందిస్తూ జాతి వివ‌క్ష దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆ అంశాల‌పై దేశాధ్య‌క్షుడు ట్రంప్ మాట్లాడాలని ఆమె తన ట్విట్ట‌ర్ అకౌంట్‌ ద్వారా డిమాండ్ చేశారు. 
 
జాతి వివ‌క్ష దాడులు జ‌రుగుతున్నాయ‌ని అధ్య‌క్షుడికి చెప్సాల్సిన అవ‌స‌రం లేద‌ని, కానీ అలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు అధ్య‌క్షుడు ముందుకు వ‌చ్చి, ప్ర‌జ‌ల‌కు అండ‌గా మాట్లాడాల‌ని హిల్ల‌రీ అన్నారు. కాన్సస్‌లో జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌పై దేశాధ్య‌క్షుడు ట్రంప్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏమీ మాట్లాడ‌లేదు. కానీ వైట్‌హౌస్ ప్రెస్ సెక్ర‌ట‌రీ సీన్ స్పైస‌ర్ మాత్రం ఆ కాల్పుల ఘ‌ట‌న‌ను హేట్ క్రైమ్‌గా చిత్రీక‌రించ‌డాన్ని ఆమె వ్య‌తిరేకించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments