Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు ఇల్లు కదిలి రావాలన్పించడంలేదు... హిల్లరీ, ఆమె సంగతి తర్వాత చూస్తా... ట్రంప్

గెలుపు ఖాయం అనుకున్నవారు ఓడితే ఎలా ఉంటుంది..? కోలుకోవడం కాస్త కష్టమే. ఆటగాళ్లయితే నేలపై పడుకుని ఏడుస్తారు. అఫ్‌కోర్స్.. ఈమధ్య గెలిచినవారు కూడా నేలపై బోర్లా పడుకుని ఏడుస్తున్నారనుకోండి. ఇంతకీ విషయం ఏమిటంటే... మొన్న అమెరికా ఎన్నికల్లో జస్ట్ గెలుపు అంచు

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (19:48 IST)
గెలుపు ఖాయం అనుకున్నవారు ఓడితే ఎలా ఉంటుంది..? కోలుకోవడం కాస్త కష్టమే. ఆటగాళ్లయితే నేలపై పడుకుని ఏడుస్తారు. అఫ్‌కోర్స్.. ఈమధ్య గెలిచినవారు కూడా నేలపై బోర్లా పడుకుని ఏడుస్తున్నారనుకోండి. ఇంతకీ విషయం ఏమిటంటే... మొన్న అమెరికా ఎన్నికల్లో జస్ట్ గెలుపు అంచుల దాకా వచ్చి ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ చాలా బాధపడుతోందట. ఇంట్లో వంటరిగా కూర్చుని మధనపడుతున్నదట. ఎవరు పిలిచినా ప్రస్తుతానికి రాలేనని చెపుతోందట. 
 
కానీ చిల్డ్రన్స్ డిఫెన్స్ ఫండ్ కోసం రావాలన్న పిలుపు అందగానే ఓపిక తెచ్చుకుని మరీ వెళ్లిందట. అంతేకాదు... అక్కడ తన అభిప్రాయాన్ని కూడా చెప్పుకొచ్చిందట. తనకు ఎక్కడికీ వెళ్లాలనిపించడంలేదనీ, ఐతే పిల్లల కార్యక్రమం కాబట్టి కాదనలేక వచ్చినట్లు వెల్లడించారు. ఏదో ఒక పుస్తకాన్ని చదువుతూ కాలం లాగించేయాలని అనిపిస్తోందని ఆమె చెప్పుకున్నారు. ఆమెను చూసినప్పుడు ఓటమి ఎంత ఆవేదనను కలిగిస్తుందో అర్థమవుతుంది.
 
ఇకపోతే గెలిచిన ట్రంప్ వ్యవహారం మరోలా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. 30 లక్షల మందిని అమెరికా నుంచి పారదోలుతా... జైల్లో పెడుతానంటూ చెప్పేస్తున్నారు. జనవరిలో అమెరికా పీఠం పైన కూర్చోకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ అక్కడ నివాసముంటున్న ఎన్నారైల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. మరి అది ఆచరణలో పెట్టి చూపిస్తారో ఏంపాడో అని కొందరు భయపడుతున్నారు. 
 
కాగా హిల్లరీపైన కొన్ని కేసులు ఉన్నాయి కదా... వాటిపై ఏమయినా కన్నేస్తారా అని అడిగితే... తెలివిగా ఇప్పుడే కాదు... దాని సంగతి తర్వాత. ఇప్పుడు నాకు అమెరికా దేశంపైనా ప్రధాన దృష్టి అని సెలవిచ్చారు. దీన్నిబట్టి ఎన్నికల హిల్లరీపైన ఎలాంటి చర్యలు తీసుకోరన్నమాట. చాలా మంచి ట్రంప్ అవుతున్నారన్నమాట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments