Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళికంటూ బయల్దేరి జైలు డాబాపై దిగిన హెలికాఫ్టర్.. పరుగులు తీసిన సిబ్బంది..

పెళ్ళి వేడుక కోసం హెలికాప్టర్‌లో బయల్దేరిన ఓ కుటుంబం.. నేరుగా కళ్యాణ మండపానికి వెళ్లకుండా జైలులోకి వెళ్ళిపోయింది. అంతే పోలీసులు చుట్టుముట్టారు. వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు మొదలెట్టారు. ఎక్కడ న

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (12:10 IST)
పెళ్ళి వేడుక కోసం హెలికాప్టర్‌లో బయల్దేరిన ఓ కుటుంబం.. నేరుగా కళ్యాణ మండపానికి వెళ్లకుండా జైలులోకి వెళ్ళిపోయింది. అంతే పోలీసులు చుట్టుముట్టారు. వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు మొదలెట్టారు. ఎక్కడ నుంచి వచ్చారు.. ఎందుకు జైలు డాబాపై దిగారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. చివరికి పెళ్ళి కోసం బయల్దేరి.. పైలట్ చేసిన తప్పిదం కారణంగా హెలికాప్ట‌ర్ జైలు డాబాపై ల్యాండ్ అయ్యిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌లోని కాశింపూర్‌ ప్రాంతంలో ఉన్న సెంట్రల్‌ జైలులో ఈ ఘటన జరిగింది. దీనిపై జైలు అధికారులు మాట్లాడుతూ.. ఆ జైలులో ఉగ్ర‌వాదులు ఉన్నార‌ని, వారిని తప్పించేందుకు దాడులు జ‌ర‌గ‌వ‌చ్చ‌ని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయని, దీంతో తాము మొద‌ట ఆ హెలికాప్ట‌ర్‌లో ఉన్న‌వారిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. 
 
కానీ పైలట్‌ పొరపాటున కాశింపూర్‌ సెంట్రల్‌ జైలులో ఆ హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేశాడని తెలిపారు. హెలికాప్ట‌ర్‌లో ఉన్న ఐదుగురు ప్రయాణికులను, పైలట్‌ను అదుపులోకి తీసుకొని విచారించి అస‌లు విషయాన్ని తెలుసుకుని వ‌దిలిపెట్టిన‌ట్లు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments