Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ ప్రవాసులుకు తీపికబురు.. !

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (09:10 IST)
యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది.భారత్‌తో పాటు మరో పది దేశాల ట్రాన్సిట్ విమానాలకు యూఏఈ గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది.ట్రాన్సిట్ అనుమతులు పొందిన దేశాల జాబితాలో భారత్, పాకిస్తాన్, శ్రీ లంక, నైజీరియా, ఉగాండా, వియత్నాం, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, నేపాల్ ఉన్నాయి.
 
కరోనా వల్ల ఆయా దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులు ఈ విమానాల ద్వారా తిరిగి యూఏఈ రావొచ్చని పేర్కొంది.అయితే, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే యూఏఈ ప్రయాణానికి 14 రోజుల ముందు రెండో డోసు తీసుకున్న ప్రయాణికులు కూడా రావొచ్చునని.ఇలాంటి వారు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సర్టిఫికేట్ చూపించాలని తెలిపింది.
 
ప్రధాన రంగాలైన హెల్త్ వర్కర్స్ (వైద్యులు, నర్సులు, టెక్నిషీయన్స్), టీచింగ్ స్టాఫ్ (యూనివర్శిటీ, కళాశాల, పాఠశాల, ఇతర విద్యా సంస్థల్లో పనిచేస్తున్నవారు) యూఏఈ తిరిగి రావొచ్చని షనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌సీఈఎంఏ) వెల్లడించింది.
 
ఇక కొత్త మార్గదర్శకాల ప్రకారం యూఏఈ రావాలనుకునే ప్రయాణీకులు.ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.టీకా సర్టిఫికేట్‌లతో పాటు ప్రయాణికులు బయల్దేరే 48 గంటల లోపే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్‌ను సమర్పించాలి.అలాగే వారు విమానం ఎక్కేముందు కూడా ల్యాబ్ టెస్ట్ నిర్వహించబడుతుంది.యూఏఈ చేరుకున్న వెంటనే మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments