Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విమ్మింగ్ పూల్‌లో వాటర్ కెమేరాలు... బాలికలను అలా వీడియో తీసిన వాడెవడు?

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (13:49 IST)
చిన్నారులపై లైంగిక దాడులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా స్విమ్మింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్లిన 37 మంది చిన్నారులపై కోచ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జర్మనీలో 34 ఏళ్లకు చెందిన ఓ వ్యక్తి స్విమ్మింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇతని వద్ద వయో వ్యత్యాసం లేకుండా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తారు. 
 
కానీ ఆ కోచ్ 37 మంది చిన్నారులను లైంగికంగా వేధించాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా  37మంది చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తమపై జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్తే చంపేస్తానంటూ బాలికలను బెదిరించాడు. 
 
ఈ నేపథ్యంలో కోచ్ చేతిలో లైంగిక దాడికి గురైన ఓ చిన్నారి.. తల్లిదండ్రులతో ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోచ్‌ను అరెస్ట్ చేసి విచారణ జరిపారు. అతనికి కోర్టు ముందు హాజరు పరిచారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కామాంధుడైన కోచ్‌కి 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 
 
స్విమ్మింగ్ పూల్స్, డ్రెస్సింగ్ రూమ్‌ల్లో బాలికలపై ఈ కామాంధుడు లైంగిక దాడులకు పాల్పడే వాడని విచారణలో తేలింది. స్విమ్మింగ్ పూల్ వాటర్‌లో కెమెరాలను పెట్టి చైల్డ్ పోర్నో గ్రఫీకి కూడా పాల్పడ్డాడని తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం