Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్మనీలో హారర్ మదర్: గర్భవతిగానే కనిపించేది.. కానీ పుట్టిన ఎనిమిది శిశువులు ఏమయ్యారు?

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడానికి భయం. పిల్స్ వేసుకోవడానికి ఇష్టం లేదు. కానీ ఆ దంపతులు శారీరక వాంఛలను మాత్రం వదులుకోరు. ఈ దంపతులకు పది సంవత్సరాల్లో ఎనిమిది శిశువులు పుట్టారు. అయితే ఒక్క శిశువూ ప్ర

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (15:02 IST)
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడానికి భయం. పిల్స్ వేసుకోవడానికి ఇష్టం లేదు. కానీ ఆ దంపతులు శారీరక వాంఛలను మాత్రం వదులుకోరు. ఈ దంపతులకు పది సంవత్సరాల్లో ఎనిమిది శిశువులు పుట్టారు. అయితే ఒక్క శిశువూ ప్రాణాలతో లేదు. ఇంతకీ ఆ పిల్లలు ఏమయ్యారు? వారికి ఏమైనా వ్యాధా? అని అనుకుంటున్నారు కదూ. అలాంటిది ఏమీ లేదు. కన్నతల్లే ఆ బిడ్డల్ని హతమార్చింది. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. 
 
స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటికొచ్చాయి. ఎప్పుడూ గర్భంగా కనిపించే ఆ తల్లి పుట్టిన పిల్లల్ని ఏం చేస్తుంది. 8 మంది ఏమయ్యారు. చిన్నారి పాప ఏడ్చే శబ్ధమే వినిపించదే అంటూ స్థానికులు వేసిన ప్రశ్నకు ఆ దంపతులు ఇచ్చిన సమాధానం అందరికీ షాక్‌నిచ్చింది.  
 
జర్మనీకి చెందిన ఆండ్రియా (45), జోహాన్‌ (54) దంపతులకు వివాహమైన మూడేళ్లలో ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత పిల్లలు వద్దనుకున్నారు కానీ, కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవాలంటే భయపడ్డారు. పిల్స్ కూడా వేయించుకోలేదు. అయినా వారిద్దరూ తమ శారీరక వాంఛలను మాత్రం వదులుకోలేదు. ఫలితంగా ఆండ్రియా గర్భం ధరిస్తూ ఉండేది. 
 
గత పదేళ్లలో ఇలా ఎనిమిది సార్లు గర్భవతి అయింది. ప్రసవం అయిన వెంటనే ఆ పసిబిడ్డను హ్యాండ్‌టవల్‌లో వేసి ఊపిరి ఆడకుండా చేసి ఆండ్రియా చంపేసేది. ఇంకా శిశు శవాలను ఇంట్లోనే భద్రపరిచేది. ఇలా ఎనిమిది మంది శిశువులను పురిట్లోనే కడతేర్చింది. ఎప్పుడూ గర్భవతిగానే కనిపించే ఆండ్రియా పిల్లలు బయట కనిపించకపోవడంతో పక్కింటి వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆండ్రియా దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆండ్రియాను స్థానికులు హారర్ మదర్‌గా పిలుస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం