Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో స్వలింగ సంపర్కులకు ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్‌మెంట్.. ఎందుకో?

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2015 (11:45 IST)
చైనాలో స్వలింగ సంపర్కుల మనసు మార్చేందుకు ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆ దేశ ప్రభుత్వం స్వలింగ సంపర్కులకు ఎలక్ట్రిక్ షాక్‌లతో కూడిన ట్రీట్‌మెంట్ ఇస్తోంది. 1997లో చైనాలో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయగా.. ప్రస్తుతం స్వలింగ సంపర్కుల మనసులను మార్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. 
 
చైనాలో రోజు రోజుకు స్వలింగ సంపర్కుల సంఖ్య పెచ్చరిల్లిపోవడంతో ఇక చేసేది లేక షాక్ ట్రీట్‌మెంట్ విధానాన్ని ఆ దేశ సర్కారు ప్రోత్సహిస్తోంది. 'చానల్ 4' ఓ సీక్రెట్ ఆపరేషన్ చేసి, ఆపై ప్రసారం చేసిన డాక్యుమెంటరీలో చైనా సర్కారు చేసే విషయాలు బహిర్గతమైనాయి. చైనాలోని ఆసుపత్రుల్లోని వైద్యులు స్వలింగ సంపర్కులకు డ్రగ్స్‌తో పాటు, అత్యంత బాధాకరమైన ఎలక్ట్రిక్ షాక్ థెరపీలను 'హోమోసెక్సువాలిటీ'కి వైద్యంగా సూచిస్తున్నారు. 
 
స్వలింగ సంపర్కంపై ఉండే ప్రేమ.. వారికి అందించిన చికిత్స తర్వాత భయంగానే మారిపోతుందని వైద్యులు చెప్తున్నారు. ఒక ఆసుపత్రి ఈ ట్రీట్ మెంట్ ఇస్తే, అనంతరం బాధితుడికి 3,500 యువాన్ లను పరిహారంగా ఇస్తుందట. ఆపై వెబ్ సైట్లో క్షమాపణలు కూడా చెప్పాలట. ఆసుప్రతులు ఇచ్చే పరిహారాన్ని వివిధ రూపాల్లో కట్టాల్సిన పన్నుల నుంచి మినహాయించుకోవచ్చునని వైద్యులు అంటున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments