Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఊర్లో 28 యేళ్ళ తర్వాత పాప పుట్టింది.. మొత్తం జనాభా 85కు పెంచింది.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (12:53 IST)
సాధారణంగా ఒక గూడెంను తీసుకున్నా కనీసం వంద మందికి తగ్గకుండా ప్రజలు ఉంటారు. కానీ, ఆ ఊర్లో మాత్రం ఇటీవల పుట్టిన పసికందుతో కలుపుకుని మొత్తం జనాభా 85కు పెరిగింది. ఇది వినేందుకు ఆశ్చర్యంగానూ.. కాస్తంత విచిత్రంగానూ ఉంది కదూ. కానీ, ఇది నిజం. యూరప్ దేశాల్లో ఒకటైన ఇటలీలోని ఓస్తానా అనే అతి చిన్న పట్టణంలో మొత్తం జనాభా కేవలం 85 మంది మాత్రమే. అదీ మూడు రోజుల క్రితం పట్టిన ఓ పసికందుతో కలుపుకుని. పైగా, ఈ పట్టణంలో గత 28 యేళ్ళ తర్వాత పుట్టిన తొలి బిడ్డ కూడా ఈ పసికందే. దీనికి కారణమేంటో తెలుసుకుందాం.. 
 
ఈ ప్రాంతంలో 1975కు ముందు అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ పట్టణ ప్రజలంతా నగరాలకు వలస వెళ్లిపోయారు. దీనివల్ల జనాభా రోజురోజుకీ తగ్గిపోతూ వస్తోంది. దీంతో 1976 నుంచి 87 వరకు ఒస్తానాలో కేవలం 17 మంది పిల్లలు మాత్రమే పుట్టారు. 1987 తర్వాత 2016 వరకు పట్టణంలో ఒక్క జననం కూడా నమోదు కాలేదు. అయితే, ఇటీవల పుట్టిన పాప ఆ లోటును భర్తీ చేయడమే కాకుండా, జనాభాను 85కు పెంచింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments