Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నడిరోడ్డుపై మ్యాట్ వేసుకుని యోగా చేయాలి..

ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నడిరోడ్డుపై యోగా చేయాలా? ఇదేంటి? అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే చదవండి మరి. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు జనాలు కోపంతో విసుక్కుంటారు. సహనం కోల్పోతారు. కోపంలో ఏవేవో చేస్తుంటా

Webdunia
సోమవారం, 15 మే 2017 (12:46 IST)
ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నడిరోడ్డుపై యోగా చేయాలా? ఇదేంటి? అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే చదవండి మరి. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు జనాలు కోపంతో విసుక్కుంటారు. సహనం కోల్పోతారు. కోపంలో ఏవేవో చేస్తుంటారు. అయితే ట్రాఫిక్‌లో చిక్కుకుని విసుక్కోవడం కంటే హ్యాపీగా యోగా చేసుకోవచ్చు అంటోంది దక్షిణ ఫ్లోరిడాకు చెందిన క్రిస్టిన్. 
 
అసలు విషయం ఏమిటంటే? ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేందుకు చాలా సమయం పట్టేలా వుందని తెలుసుకున్న క్రిస్టిన్.. కారి దిగి నడిరోడ్డుపై ఎంచక్కా యోగా చేస్తూ టైమ్ పాస్ చేసింది. అంతేకాకుండా.. అలా యోగా చేస్తున్నప్పుడు తన భావాలను కూడా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది. దీంతో ఆమె స్టోరీ కాస్త వైరల్‌గా మారింది. అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాకు చెందిన క్రిస్టిన్... మియామీ న్యూటైమ్స్ అనే పత్రికలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఓ రోజు ఆమె కారులో మియామీ మీదుగా వెళ్తుండగా దారిలో ట్రక్కు బోల్తా పడడంతో ట్రాఫిక్ జామ్ అయింది. 
 
గంటలు గడుస్తున్నా ట్రాఫిక్ ముందుకు కదలకపోవడంతో విసుగెత్తిపోయిన క్రిస్టిన్ కారు దిగి నడిరోడ్డుపై మండుటెండలో మ్యాట్ వేసుకుని యోగా చేస్తూ కూర్చుంది. తన కారు డ్రైవర్‌తో ఫొటోలు తీయమని చెప్పింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు జనాలు ఎలా విసుక్కుంటారో.. ట్రాఫిక్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారో చెప్పడానికే ఇలా చేశానని క్రిస్టిన్ వెల్లడించింది. ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments