Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లోరిడాలో భద్రకాళి, శివంగిల్లా నడిరోడ్డుపై కొట్టుకున్న మహిళలు.. సోషల్ మీడియాలో వైరల్..

ఇద్దరు మహిళలు నడి రోడ్డుపై కొట్టుకున్నారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని సిగపట్లు పడ్డారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ బూతులు తిట్టుకున్నారు. వారిని ఆపేందుకు వచ్చిన పురుషులను తోసేసి మరీ కొట్టుకున్నారు. చుట్

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (13:32 IST)
ఇద్దరు మహిళలు నడి రోడ్డుపై కొట్టుకున్నారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని సిగపట్లు పడ్డారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ బూతులు తిట్టుకున్నారు. వారిని ఆపేందుకు వచ్చిన పురుషులను తోసేసి మరీ కొట్టుకున్నారు. చుట్టు మనుషులు ఉన్నారన్న ధ్యాస కూడా మర్చిపోయి ఇద్దరు మహిళలు బరితెగించారు. చూసిన నలుగురు నవ్వుతారనే సోయి కూడా మరిచి నడిరోడ్డుపై తన్నుకున్నారు. అది కూడా అలాంటిలాంటి తన్నుకోవడం కాదు.. ముష్టి యుద్ధం చేసినట్లుగా నేలపై పొర్లిపొర్లి తన్నుకున్నారు. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ఈ తతంగాన్నంత కారులో వెళుతున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టారు. ఇప్పుడది కాస్త వైరల్ అయ్యింది. '
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. అంబర్ కుక్ అనే ఓ యువతి మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ నల్లటి బాస్కెట్ బాల్ టీషర్ట్, ఓ బ్లాక్ ప్యాంటు వేసుకొని ఉంది. తన ఇంటి డోర్ ముందు ఏదో ఆలోచించుకుంటు ఉన్న ఆమె వైపు ఓ ఎరుపు రంగు టీషర్ట్ దరించిన యువతి వేగంగా జాగింగ్‌కు వచ్చినట్లు వచ్చి నేరుగా వెళ్లి ముఖంపై ఒక్క పంచ్ ఇచ్చింది. ఆ పంచ్‌కు అంబర్ కుక్ ముక్కు అదిరిపోయింది. దీంతో ఒక్కసారిగా భద్రకాళిలా మారింది. 
 
తనపై దాడికి దిగిన ఆ అమ్మాయిని ఏకంగా శివంగిలా ఎత్తిపడేసింది. వరుసపెట్టి ముఖంపైనే పిడిగుద్దులు గుప్పించింది. ఆమె జుట్టును చేతికందుకొని పైకి కిందికి ఊపుతూ ఎంత ధైర్యం ఉంటే... నన్ను కొడతావ్ అంటూ అదనంగా తన్నడం కూడా మొదలు పెట్టింది. దాంతో దెబ్బలు తింటూ ఆమె చేతి కింద నలిగిపోతున్న యువతి లబోదిబోమంటూ అరవడం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఆఖరికి అంబర్ అలిసిపోయిన తర్వాత తన మార్గాన తాను వెళ్లిపోతున్నప్పటికీ మరోసారి దాడి చేసి చుక్కలు చూపించింది. అంబర్ ఎంత ఉగ్రరూపం దాల్చిందటే వారి ఫైటింగ్ ఆపేందుకు వెళ్లిన పురుషుడు కూడా వెనక్కి తగ్గాడు. అంతలా రెచ్చిపోయి వీధుల్లో వారిద్దరు తన్నుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది. 
 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments