Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతుర్ని, ఆరుగురు మనవళ్ళని కాల్చి చంపాడు... ఫ్లోరిడాలో దారుణం!

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (18:56 IST)
అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన కుమార్తెతో పాటు ఆరుగురు మనవళ్లను కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... డాన్ ఛార్లెస్ స్పిరిట్ (51) అనే వ్యక్తి ఫ్లోరిడాలోని బెల్ పట్టణంలో నివశిస్తున్నాడు. ఈయన ఇంట్లో ఉన్న ఏడుగురిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ తర్వాత అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ఆత్మహత్య చేసుకునే ముందే అత్యవసర సేవల విభాగానికి ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పాడే కానీ.. ఇంటి చిరునామా మాత్రం చెప్పలేదు. 
 
అయితే, ఫోన్ నంబర్ ఆధారంగా ఇంటి చిరునామా కనిపెట్టిన పోలీసులు అక్కడుకు చేరుకునే సమయానికి డాన్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. మొత్తం ఆ ఇంట్లో ఎనిమిది మంది మృతదేహాలు రక్తపు మడుగులో ఉన్నాయి. హత్య చేసిన చిన్నారుల్లో మూడు నెలల బిడ్డతో పాటు.. పదేళ్ల లోపు వారే. డాన్ ఛార్లెస్ మనవళ్లను, కూతుర్నీ చంపడానికి గల కారణాలు తెలియలేదు. కాగా, డాన్ స్పిరిట్ తన ఎనిమిదేళ్ల కొడుకును 2001లో కాల్చి చంపినట్లు స్థానికులు చెప్పారు. ఈ నేరానికి జైలుకు వెళ్లిన డాన్ 2006లో విడుదలయ్యాడు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments