Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులు తీసుకున్నారు.. మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఇంతలో ఏం జరిగిందంటే?

ఆ దంపతులు విడాకులు తీసుకున్నారు. అయినా మళ్లీ ఏకం కావాలనుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఇంతలో ఎక్కడ నుంచో వచ్చిన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. క్రిస్టోఫర్‌బౌమన్(39), అతడి భార్య

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (09:00 IST)
ఆ దంపతులు విడాకులు తీసుకున్నారు. అయినా మళ్లీ ఏకం కావాలనుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఇంతలో ఎక్కడ నుంచో వచ్చిన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. క్రిస్టోఫర్‌బౌమన్(39), అతడి భార్య చెస్లాబౌమన్(30)లు చాలారోజులక్రితమే విడిపోయారు. వారు మళ్లీ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్చిలో వారికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. 
 
అప్పటినుంచి భార్య చెస్లా కూడా క్రిస్టోఫర్ ఇంట్లోనే ఉంటోంది. పిల్లలకు కుక్కపిల్లలంటే ఇష్టముండటంతో క్రిస్టోఫర్, కుక్కపిల్ల కావాలంటూ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్టు పెట్టాడు. అది చూసిన ఓ వ్యక్తి శనివారం ఓ కుక్కపిల్లను తీసుకుని, క్రిస్టోఫర్ ఇంటికి వచ్చాడు. క్రిస్టోఫర్ ఆ సమయంలో మందు తాగుతున్నాడు. ఇంటికి వచ్చిన వ్యక్తిని కూడా తాగమంటూ క్రిస్టోఫర్ ఆఫర్ చేశాడు. 
 
అతను వద్దన్నా మందు తాగాల్సిందేనని క్రిస్టోఫర్ ఒత్తిడి చేశాడు. దీంతో ఇద్దరూ మందు తాగడం మొదలెట్టారు. మందు తాగుతూనే ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. అంతా ముగిసిన తర్వాత ఆ వ్యక్తి ఇంట్లోంచి వెళ్లిపోకుండానే చెస్లావైపు అదోలా చూడటం మొదలుపెట్టాడు. చెస్లా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో కోపంతో క్రిస్టోఫర్, అతడిని బయటకు వెళ్లమన్నాడు. అతడు కూడా కోపంతో తన దగ్గర ఉన్న తుపాకీతో క్రిస్టోఫర్‌ తలపై కాల్చాడు. దాంతో క్రిస్టోఫర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని.. పిల్లలు, భార్య ముందే జరిగిన ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments