Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా సరిహద్దుల్లో విషాదం.. కూలిన ఎయిర్ అంబులెన్స్

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (17:37 IST)
అమెరికా సరిహద్దుల్లో విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. నెవాడా సరిహద్దుల్లో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో అంబులెన్స్‌లో ఉన్న ఐదుగురు చనిపోయారని అధికారులు చెబుతున్నారు. వీరిలో రోగి కూడా ఉన్నారు.
 
గత కొన్ని రోజులుగా అగ్రరాజ్యం అమెరికాలోని అనేక ప్రాంతాల్లో విపరీతమైన మంచు తుఫాను కురుస్తుంది. ఈ కారణంగా అనేక విమాన సర్వీసులను రద్దు చేశారు. ప్రజా రవాణాకు తీవ్ర ఆటంకాలు కూడా కలుగుతున్నాయి. ఈ క్రమంలో నెవాడాలో ఓ రోగిని తరలిస్తున్న ఎయిర్ అంబులెన్స్ ఒకటి కుప్పకూలిపోయింది. విమానం ప్రయాణించేందుకు ఏమాత్రం అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో ప్రమాదం జరిగింది. 
 
నెవాడా సరిహద్దుల్లో వచ్చే సరికి విమానం రాడార్‌‍తో సంబంధాలు కోల్పోయింది. సెంట్రల్ లియోన్ కౌంటీలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ప్రమాద సమయంలో ఎయిరి అంబులెన్స్‌ విమానంలో పైలెట్, రోగి, రోగి సహాయకుడు, నర్సు, పారామెడికల్ నిపుణుడు ఉన్నారు. వీరందరూ ప్రాణాలు కోల్పోయినట్టు సెంట్రల్ లియోన్ కౌంటీ అధికారులు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments