Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్ల రసంతో స్నానం చేశాడు... రాత్రికి రాత్రే యూట్యూబ్‌ సెన్సేషన్‌గా మారిపోయాడు

పాపులారిటీకీ.. డబ్బు సంపాదనకీ ఇప్పుడు యువతను ఆకర్షిస్తోన్న ఏకైక మార్గం సోషల్ మీడియా. ఏం చేసైనా సరే.. నెటిజెన్స్ ఫాలోయింగ్ పెంచుకోవడం, తద్వారా డబ్బు సంపాదించుకోవడమే టార్గెట్‌గా ఎంతటి దుస్సాహాసాలకైనా తె

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (11:57 IST)
పాపులారిటీకీ.. డబ్బు సంపాదనకీ ఇప్పుడు యువతను ఆకర్షిస్తోన్న ఏకైక మార్గం సోషల్ మీడియా. ఏం చేసైనా సరే.. నెటిజెన్స్ ఫాలోయింగ్ పెంచుకోవడం, తద్వారా డబ్బు సంపాదించుకోవడమే టార్గెట్‌గా ఎంతటి దుస్సాహాసాలకైనా తెగిస్తోంది నేటి యువత. ఇదే తరహాలో ఏకంగా చిల్లీ సాస్ నింపిన టబ్‌లో స్నానం చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచిన వ్యక్తి  గుర్తుంది కదా.. అంత సాహసానికి పాల్పడినా ఎవరూ అతడిని పెద్దగా పట్టించుకోలేదు. 
 
అందుకోసమే ఈసారి మరో వినూత్నమైన ఐడియాతో ముందుకొచ్చాడు. విల్లీవాంక్‌లోని చాక్లెట్‌ సరస్సు, చాక్లెట్‌ ఫ్యాక్టరీలు మనకు తెలుసు. కానీ ఇతను ఏకంగా చాక్లెట్‌ బాత్‌టబ్‌ సృష్టించాడు. చాక్లెట్లు అంటే చాలామంది పడిచస్తారు. కొందరు అస్తమానం చాక్లెట్లు నమలడానికి ఇష్టపడితే.. మరికొందరు బాటిళ్లకొద్దీ చాక్లెట్‌ రసాన్ని తాగే వీరాభిమానులు ఉంటారు. ఇతడు ఆ కోవకు చెందినవాడే.  సిమ్రే కాండర్‌ ఈ వ్యక్తి మాత్రం చాక్లెట్ల రసమైన న్యెటెల్లాపై తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు.
 
చాక్లెట్‌ రసం న్యుటెల్లాతో సాన్నపుకుండీని నింపి.. అందులో ఈతకొట్టాడు. 'వావ్‌.. వావ్‌' అంటూ ఒంటినిండా చాక్లెట్‌ రసాన్ని పూసుకొని.. అందులో జలకాలాడాడు. కొంతసేపటికే ఆ రసం గట్టిగా, జిగటుగా మారిపోవడంతో కదలడమే కష్టతరంగా మారింది. అయినా అతికష్టం మీద చాక్లెట్‌ బాత్‌టబ్‌లో మునిగితేలుతూ చిత్రవిచిత్రమైన స్టెప్టులు కూడా వేశాడు. దీంతో రాత్రికి రాత్రే సిమ్రే యూట్యూబ్‌ సెన్సేషన్‌గా మారిపోయాడు. ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో పెట్టిన అతని వీడియోను 30లక్షలమందికి పైగా వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments