Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెడరల్ కోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు.. ఇమ్మిగ్రేషన్ బ్యాన్‌‍‌ నిలిపివేత.. స్టే కోసం మల్లగుల్లాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై న్యాయ వ్యవస్థ గుర్రుగా ఉంది. ట్రంప్ విధానాలకు న్యాయవ్యవస్థల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఏడు ముస్లి ఆధిక్య దేశాల వారు అమెరికాలోకి ప్రవేశించకుండా విధించి

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (15:24 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై న్యాయ వ్యవస్థ గుర్రుగా ఉంది. ట్రంప్ విధానాలకు న్యాయవ్యవస్థల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఏడు ముస్లి ఆధిక్య దేశాల వారు అమెరికాలోకి ప్రవేశించకుండా విధించిన నిషేధాన్ని అమెరికాలోని ఓ ఫెడరల్ కోర్టు దేశవ్యాప్తంగా నిలిపివేసింది. 
 
అధ్యక్షుడి ఆదేశాలను అమెరికా రాష్ట్రాలు ప్రశ్నించలేవన్న ప్రభుత్వం న్యాయవాదుల వాదనలతో ఫెడరల్‌ జడ్జి జేమ్స్‌ రాబర్ట్స్‌ విభేదిస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో న్యాయమూర్తి ట్రంప్ ఆదేశాలను నిలిపివేయటంపై స్టే కోరాలని న్యాయ విభాగం భావిస్తోంది. ఇంకా దీనిపై చట్టబద్ధంగా, న్యాయమార్గంలో వెళ్లాలని ట్రంప్ సూచించినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. 
 
ఇదిలా ఉంటే.. గత వారం ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటీవ్‌ ఆర్డర్ల కారణంగా అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దాదాపు 60,000 వీసాలను అధికారులు రద్దు చేశారు. ఇంకా ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి వలసదారులు అమెరికాలోకి ప్రవేశించకుండా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ వాషింగ్టన్‌ రాష్ట్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiara Advani: గుడ్ న్యూస్ చెప్పిన కియారా దంపతులు.. పాప సాక్స్ ఫోటోతో?

టీజర్ లో మించిన వినోదం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఉంటుంది : చిత్ర బృందం

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి 'కన్నా నీ..' సాంగ్ రిలీజ్

Anasuya: అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నాగబంధం మూవీ

శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్, బాబీ నిర్మాతలుగా రాజమండ్రీలో తాజా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments