Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్ బుక్ జుకర్‌బర్గ్‌తో నాలుగేళ్లు పనిచేశాడు.. ఇప్పుడు బ్రేస్ లైట్లు అమ్ముకుంటున్నాడు?

లక్షల రూపాయల జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. బ్రేస్ లైట్లు అమ్ముకుంటున్నాడు. అయినా అందులోనే సంతృప్తి ఉందంటున్నాడు. బ్రేస్ లైట్ల ద్వారా అందమే కాదు.. మనలో కొత్త ఉత్తేజం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆయ

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2016 (14:43 IST)
లక్షల రూపాయల జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. బ్రేస్ లైట్లు అమ్ముకుంటున్నాడు. అయినా అందులోనే సంతృప్తి ఉందంటున్నాడు. బ్రేస్ లైట్ల ద్వారా అందమే కాదు.. మనలో కొత్త ఉత్తేజం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆయన ఎవరంటే..? చైనా సంతతికి చెందిన 30ఏళ్ల క్రిస్‌ పాన్‌ మొదట మెకిన్సే అండ్‌ కో సంస్థలో సీనియర్‌ కన్సల్టెంట్‌గా కొన్నాళ్లు పని చేశాడు. ఆ తర్వాత పెప్సీకో సంస్థలో మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా రెండేళ్లపాటు విధులు నిర్వర్తించాడు.
 
అనంతరం ఫేస్‌బుక్‌ సంస్థలో మార్క్‌ జుకర్‌బర్గ్‌తో కలిసి నాలుగేళ్లు పని చేశాడు. ఆ సమయంలో క్రిస్‌ పాన్‌.. మార్క్‌కి చాలా దగ్గరయ్యాడు. ఇదేసమయంలో ఉద్యోగమే జీవితం కాకూడదని.. కొత్త ఆలోచనతో జీవితాన్ని ముందుకు సాగనివ్వాలని భావించాడు. ప్రపంచం చుట్టిరావాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్రిడ్‌ షాండర్స్‌ అనే యువతి పాన్‌కి పరిచయమైంది. ఆమె రోజూ తలచుకునే పదం ఒకటి చెప్పమని అడిగితే.. వెంటనే పాన్ ఇంపాక్ట్ పదం చెప్పాడు. 
 
ఆ పదాన్ని బ్రేస్ లైట్‌పై చెక్కి బహుబతిగా ఇచ్చింది. ఆ తర్వాతే తన బ్రేస్ లైట్‌పై అక్షరాలు రాసే పనిముట్లను పాన్‌కి ఇచ్చి అతని స్నేహితులకు కూడా ఇలాగే చేసివ్వమని కోరింది. లాస్‌ ఏంజిల్స్‌కి వెళ్లిన తర్వాత పాన్‌ స్థానిక ప్రజలను వారాంతంలో యోగా.. ధ్యానం వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టాడు. ఇలా బ్రేస్ లైట్లపై వారికి నచ్చిన పదాలను రాసిచ్చి.. తద్వారా వారిలో నూతనోత్తేజాన్ని నింపుతున్నాడు. ఈ పని తనకు సంతృప్తినిచ్చిందని క్రిస్ పాన్ అంటున్నాడు. ఈ బ్రేస్ లైట్ విధానానికి బాగా క్రేజ్ పెరిగింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments