Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈమెయిల్ డిలీట్ వ్యవహారంలో నా తప్పు ఉంది.. అందుకే సారీ చెప్పా : హిల్లరీ క్లింటన్

ఈమెయిల్ డిలీట్ వ్యవహారంలో తన తప్పు ఉందని, ఈ విషయంలో ఇప్పటికే సారీ చెప్పానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిగా పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ మరోమారు తెలిపారు. ఈ విషయంలో తన ప్రత్యర్థి డ

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (12:17 IST)
ఈమెయిల్ డిలీట్ వ్యవహారంలో తన తప్పు ఉందని, ఈ విషయంలో ఇప్పటికే సారీ చెప్పానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిగా పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ మరోమారు తెలిపారు. ఈ విషయంలో తన ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఇద్దిర మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. హిల్లరీ వ్యక్తిగత జీవితంపై ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొత్త ఉద్యోగాలు కల్పించడంలో హిల్లరీ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. తాను మారిన మనిషినని అన్నారు.
 
ముఖ్యంగా.. ఈ-మెయిల్ లీక్‌పై హిల్లరీ సమాధానం చెప్పాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయిస్తే హిల్లరీ జైలు కెళ్లడం ఖాయమన్నారు. ఈ-మెయిల్ లీక్‌పై హిల్లరీ మరోసారి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 39 వేల ఈమెయిల్స్ లీకైనప్పటికీ తప్పు జరగలేదనడం దారుణమని పేర్కొన్నారు. 
 
వీటికి హిల్లరీ క్లింటన్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు మహిళలపై ఆయనకున్న గౌరవానికి నిదర్శనమన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అర్హుడు కాదనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏమీ ఉండదన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి అమెరికా ప్రతీక అని స్పష్టం చేశారు. అధ్యక్షుడు ఒబామాపై ట్రంప్ దారుణమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.  ట్రంప్ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు. ఈ -మెయిల్ వ్యవహారంలో తన తప్పు ఉందని, దానికి గతంలోనే తాను క్షమాపణలు చెప్పానని హిల్లరీ గుర్తు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments