Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కలతో డ్రగ్స్ స్మగ్లింగ్... పట్టేశారు...

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (18:52 IST)
శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అనేది అందరికీ తెలిసిన నానుడే. చట్టాలు ఎన్ని రూపొందించబడుతాయో... నేరగాళ్ల తెలివితేటలు కూడా అంతే దారుణంగా మారిపోతున్నాయనేది కూడా నిర్వివాదాంశమే.
 
మాదక ద్రవ్యాల రవాణా అనేది ఎంతగా అరికడుతున్నా మళ్లీ మళ్లీ కొత్త మార్గాలు వెతుక్కుంటూ వెళ్లే ఒక దారుణమైన నేరం... కాగా డ్రగ్స్ స్మగ్లింగ్‌ను నిలిపివేయడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నారో... వాటిని తరలించేందుకు నేరగాళ్లు కూడా అన్ని కొత్త దారులు వెతుక్కుంటున్నారు. వీటిని చూస్తూంటే... ఒక్కోసారి డ్రగ్స్ ఇలా కూడా తరలిస్తారా అనే ఆశ్చర్యం వేయకమానదు. అలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. 
 
తాజాగా అమెరికాలో జరిగిన ఈ సంఘటన చూస్తే.. ఔరా... అనుకోక తప్పదు.. వృత్తిరీత్యా పశువుల డాక్టర్ అయిన ఆండ్రెస్ లోపెజ్ ఎలోర్జ్ (39) అనే కొలంబియాకు చెందిన వ్యక్తి ద్రవ రూపంలో ఉన్న హెరాయిన్‌‌ని కుక్కల కడుపులో నింపి అమెరికాకి తరలించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన అమెరికా నిఘా వ్యవస్థ అతడిని శిక్షించింది. 
 
ఈ విషయమై అమెరికాలోని న్యూయార్క్ అటార్నీ మాట్లాడుతూ ‘‘ప్రతి కుక్కకంటూ ఓ రోజుంటుంది అంటారు. ఈ రోజు ఎలోర్జ్ వంతు వచ్చింది. అతను తన గౌరవమైన వృతిని అవమానించి జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించడమే కాకుండా నిషేధిత పదార్థాలను అమెరికాకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు’’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments