Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి

Webdunia
ఆదివారం, 24 డిశెంబరు 2023 (08:36 IST)
అరేబియా సముద్రంలో 20 మంది భారతీయ ప్రయాణికులతో వెళుతున్న నౌకపై శనివారం డ్రోన్ దాడి జరిగింది. ఎంవీ కెమ్ ఫ్లూటో అనే వాణిజ్య నౌకలో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ఈ దాడి జరిగింది. ఈ ద్రోన్ దాడిలో ఓ ఒక్కరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్‌ పోర్టుకు 217 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ దాడి జరిగినట్టు గుర్తించారు. దాడి తర్వాత నౌకలో పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని భారతీయ నౌకాదళ అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న వెంటనే సముద్ర గస్తీ డోర్నియర్ రంగంలోకి దాడికి గురైన ఎంవీ కెమ్ ఫ్లూటో నౌకతో కమ్యూనికేషన్ సంబంధాలను తిరిగి పునరుద్ధరించిందని వెల్లడించారు.
 
ఈ దాడికి గురైన నౌకలోని మర్చంట్ షిప్ సౌదీ అరేబియాలోని ఓ పోర్టు నుంచి క్రూడాయిల్‌తో మంగళురు బయలుదేరిందని అధికారులు చెప్పారు. ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీఎస్ విక్రమ్ దాడికి గురైన కెమ్ ప్లూటో దిశగా కలిది వెళుతుందని అధికారులు వెల్లడించారు. దాడికి గురైన నౌక సహాయం అందించాలని ఆ ప్రాంతంలోని నౌకలన్నింటికీ సమాచారం అందించని వారు వెల్లడించారు. అయితే, ఎంపీ ఫ్లూట నౌక 11 నాటికన్ మైళ్ల వేగంతో వెళుతుండటంతో ఇతర నౌకలు సాయం అందించలేక పోయాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేసిన టాలీవుడ్ ప్రేమజంట!!

సాయం చేస్తూ పోతే హీరోలు అడుక్కుతినాలి : నటి మాధవీలత

మెగాస్టార్‌కి ఐకన్ స్టార్‌కి అదే తేడా? అక్కడే దెబ్బ కొడుతోంది

Pushpa 2: ఆ సీన్‌ను తొలగించండి.. 10శాతం విరాళంగా ఇవ్వండి.. తీన్మార్ మల్లన్న

దర్శకుడు శంకర్‌తో మా జర్నీ అలా మొదలైంది : నిర్మాత దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments