తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 78కి చేరింది. మొత్తం 278 మంది ప్రయాణిస్తున్న ఈ పడవలో 278 మంది ప్రయాణిస్తుండగా 58 మందిని సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మరో 148 మంది జాడ తెలియరాలేదని స్థానిక అధికారి తెలిపారు.
దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా నుండి ఉత్తర కివు ప్రావిన్స్ రాజధాని గోమాకు వెళుతుండగా గురువారం నాడు ముక్విడ్జా గ్రామానికి సమీపంలో ఉన్న కివు సరస్సులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మరణించిన 78 మంది మృతదేహాలను గోమాలోని జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. జాడ కనిపించకుండా పోయినవారి కోసం నావికులు, రెడ్‌క్రాస్ బృందాలు వెతుకుతున్నారు.
ప్రయాణీకులు, వస్తువులతో పడవ ఓవర్‌లోడ్ అయ్యిందనీ, భారీ అలల తాకిడి కారణంగా పడవ మునిగిపోయిందని అధికారులు చెప్పారు. ఈ పడవ మునుగుతున్నప్పుడు తీసిన వీడియోలో తెలుపు- నీలం రంగు పూసిన పడవ సరస్సులో బోల్తా పడే ముందు పక్కకు కదులుతున్నట్లు కనబడింది. కాంగోలో పడవ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి.