Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు భారత్ షాక్.. డ్రాగన్ పౌరులకు తీసుకురావద్దొంటూ..?

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (13:55 IST)
చైనాకు భారత్ షాకిచ్చింది. ఇప్పటికే ఇండియా, చైనా మధ్య విమానాలు రద్దయ్యాయి. అయితే చైనా పౌరులు ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి ఇండియాకు వస్తున్నారు. ఇప్పుడు వాళ్లను కూడా తీసుకురావద్దని ఎయిర్‌లైన్స్‌కు భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైనా పౌరులను భారత్‌కు తీసుకురావద్దని అన్ని ఎయిర్‌లైన్స్‌కు అనధికారిక ఆదేశాలు జారీ చేసింది.
 
గత నవంబర్‌లో చైనా కూడా ఇలాగే ఇండియాతోపాటు పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు చైనా చెప్పింది. దీంతో సుమారు 1500 మంది భారత నావికులు వివిధ చైనా పోర్ట్‌లలో చిక్కుకుపోయారు. వారిని చైనా తమ దేశంలోకి అనుమతించలేదు. ప్రస్తుతం భారత్‌ కూడా చైనా పౌరులు దేశంలోకి రాకుండా నిషేధం విధించింది.
 
అయితే ఈ ఆదేశాలను లిఖితపూర్వక ఇవ్వాలని ఎయిర్‌లైన్స్ అడుగుతున్నాయి. టికెట్లు ఉన్న చైనా పౌరులు కూడా తమ విమానాలు ఎక్కకుండా ఉండాలంటే.. ఈ ఆదేశాలను చూపిస్తామని చెబుతున్నాయి. ఇప్పటికీ టూరిస్ట్ వీసాలను ఇండియా జారీ చేయడం లేదు. కానీ టూరిస్ట్ వీసాలు కాకుండా ఇతర కేటగిరీల వీసాలు ఉన్న వాళ్లు రావచ్చు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments