Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు: ప్రపంచంలోని ముస్లింలు ఆటవికులుగా..?

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2015 (13:30 IST)
ప్రపంచంలోని ముస్లింలందరిపైనా అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లిక్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని ముస్లింలందరూ ఆటవికులుగా మారుతున్నారని వ్యాఖ్యానించారు.

9/11 దాడులను సమర్థిస్తూ, నాటి దాడులను ఎంతో మంది ముస్లింలు సమర్థించారని పేర్కొన్నారు. 9/11 దాడుల తర్వాత అమెరికాలోని ముస్లింలు సంబరాలు జరుపుకున్నారని ట్రంప్ గతంలోనూ పదేపదే వ్యాఖ్యానించారు. అమెరికాలో నివసిస్తున్న అరబ్, ముస్లింల వివరాలు సేకరించాలనే డిమాండ్‌ను తాను సమర్థిస్తున్నానన్నారు.
 
శనివారం మియామీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో డోనాల్డ్ మాట్లాడుతూ..  9/11 దాడులను సమర్థించేవారు ఓ సారి చరిత్రను తిరగేయాలని సూచించారు.  పాలస్తీనా పోరాటయోధుడు, దివంగత యాసర్ అరాఫత్, లిబియా మాజీ నియంత గడాఫీలు నాటి దాడులను ఖండించారు.

ఇస్లాం ఆచరణే ధ్యేయంగా జీవించిన ఆ ఇద్దరూ అమెరికాపై ఉగ్రవాదుల దాడి సరికాదన్నారు' అని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. గడిచిన వారంలో ఫ్లోరిడా, సరసోటాల్లో నిర్వహించిన ప్రచారసభల్లోనూ ట్రంప్ ఇదే విధమైన ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments