Webdunia - Bharat's app for daily news and videos

Install App

థ్యాంక్యూ ఇండో-అమెరికన్స్.. మీ ప్రధాని ఆర్థిక సంస్కరణలు సూపర్బ్ : డోనాల్డ్ ట్రంప్

ఇండియన్-అమెరిన్లకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు చెప్పారు. తన విజయానికి కృషిచేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (15:24 IST)
ఇండియన్-అమెరిన్లకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు చెప్పారు. తన విజయానికి కృషిచేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అమెరికా ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించడంలో కీలక రాష్ట్రాలైన ఓర్లాండ్, ఫ్లోరిడాలో ట్రంప్ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో హిందూ కమ్యూనిటీకి చెందిన ప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు. 
 
తన విజయోత్సవ ప్రచారంలో పాల్గొన్నందుకు హిందూ కమ్యూనిటీ ప్రజలను గొప్పగా ట్రంప్ కొనియాడారు. మొదటిసారి ట్రంప్ తన విజయోత్సవంలో హిందూ కమ్యూనిటీ, ఇండియన్-అమెరికన్లు చేసిన కృషిని మెచ్చుకున్నారు. అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్టు ప్రకటించారు. ''వారందరూ ఎక్కడున్నారు. వారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. మీరు నాకు ఓటు వేయడం అమేజింగ్'' అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
 
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ తీరును ఆయన మెచ్చుకున్నారు. దేశంలో మోడీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలను ట్రంప్ అభినందించారు. భారత్-అమెరికా సంబంధాలను మంచిగా కొనసాగించేందుకు కృషిచేస్తానని ఈ సందర్భంగా ట్రంప్ వాగ్దానం చేశారు. పైగా వైట్‌హౌస్‌కు భారత్ బెస్ట్ ఫ్రెండ్ కాబోతుందని వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వచ్చే యేడాది జనవరిలో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్

ఆయనకు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్: భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణం పునశ్చరణ

నయనతార, ధనుష్‌ల కాపీరైట్ వివాదం.. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే?

దేవకి నందన వాసుదేవ షూట్ అన్నీ ఛాలెంజ్ గా అనిపించాయి : మానస వారణాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments