జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఠాగూర్
ఆదివారం, 1 జూన్ 2025 (15:30 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ గురించి ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్ ఒకటి శనివారం రాత్రి తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను 2020లో ఉరితీశారని, ప్రస్తుతం ఉన్నది జో బైడెన్ క్లోన్ అని పేర్కొంటూ, ఈ కుట్ర థియరీని ఆయన బహిర్గతం చేశారు. 
 
డోనాల్డ్ ట్రంప్ శనివారం చేసిన ఆసక్తికర ట్వీట్‌లో జో బైడెన్‌ను ఆయన పూర్వీకులు గత 2020లో ఉరితీశారు అని పేర్కొన్నారు. 78 ఏళ్ల ట్రంప్.. దీనికి ఎలాంటి ఆధారం, వివరణ లేకుండా లింక్‌ను పోస్ట్ చేశారు. అలాగే, డోనాల్డ్ ట్రంప్ అనుచరులు షేర్ చేసిన పోస్ట్‌లో కూడా జో బైడెన్‌ లేరు.. 2020లో ఉరితీశారు. బైడెన్ రెండు క్లోన్స్. వాటిలో ఒకటి రోబోటింగ్ ఇంజనీరింగ్ చేసిన అత్మలేని బుద్ధిహీన బైడెన్ అని ఈ విషయం డెమొక్రాట్లకు తెలియదని పేర్కొన్నారు.
 
జో బైడెన్ గురించి ప్రజలు 'చెడుగా భావించకూడదు' అని చెప్పిన ఒక రోజు తర్వాత ట్రంప్ పోస్ట్ చేయడం గమనార్హం. డెమొక్రాట్ 'కొంతవరకు దుర్మార్గుడు' అని కూడా అన్నారు. "మీరు అతని పట్ల జాలిపడితే, అతని పట్ల జాలిపడకండి, ఎందుకంటే అతను దుర్మార్గుడు." అని పేర్కొన్నారు. 
 
బైడెన్ తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. తన జీవితకాలంలో ఒక రకమైన మితవాద వ్యక్తి. తెలివైన వ్యక్తి కాదు, కానీ కొంత దుర్మార్గుడు అని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. మీరు అతని పట్ల జాలిపడితే, అంతగా జాలిపడకండి, ఎందుకంటే అతను దుర్మార్గుడు అని పేర్కొన్నారు. ఇదిలావుంటే, శుక్రవారం తన రోగ నిర్ధారణ తర్వాత మాజీ అధ్యక్షుడు బైడెన్ తొలిసారి వ్యాఖ్యలు చేశారు. స్మారక దినోత్సవ కార్యక్రమం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ, 82 ఏళ్ల వృద్ధుడు తాను ఇప్పటికే చికిత్స పొందుతున్నానని, దీన్ని అధిగమిస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments