Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ పెళ్లయిన అమ్మాయిని పటాయించా... కానీ పనికాలేదు: డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు మరిన్ని కష్టాలు తప్పేలా కనిపించడం లేడు. ఆయన నోటి దూల కారణంగా ఇప్పటికే పలువురు మహిళలు ఆయనపై

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (13:24 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు మరిన్ని కష్టాలు తప్పేలా కనిపించడం లేడు. ఆయన నోటి దూల కారణంగా ఇప్పటికే పలువురు మహిళలు ఆయనపై పలు రకాల లైంగిక ఆరోపణలు చేశారు.
 
ఇప్పటికే నోటి దూల, శృంగారం, మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలు, వారితో తన ప్రవర్తనకు సంబంధించిన ఒక్కొక్క వీడియో, ఆడియో టేపులు బయటకొస్తున్నాయి. వీటికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. అయినప్పటికీ ఆ పార్టీ తరపున అధ్యక్ష పీఠానికి చేరువ అవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఓ వ్యానులో తన స్నేహితులతో పాటు వస్తూ, తాను చేసిన ఓ నిర్వాకాన్ని గురించి ట్రంప్ స్వయంగా చెప్పగా, అది మైక్రోఫోన్‌లో రికార్డు అయి, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ సంభాషణ ఎప్పుడు జరిగిందన్న విషయం తెలియరాలేదుగానీ, అందులో ట్రంప్ నోటి దురుసుతనం స్పష్టంగా తెలుస్తోంది.
 
చుట్టూ ఉన్న స్నేహితులు పకపకా నవ్వుతుంటే, తాను ఓ వివాహితను ఫర్నీచర్ షాపులో పటాయించానని, బయటకు కూడా తీసుకెళ్లానని, కానీ పని కాలేదని చెప్పుకొచ్చారు. ఆమె శరీర సౌష్టవాలను, అందాన్ని వర్ణించారు. వదిలేసినందుకు బాధగా ఉందన్నారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం