Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన రికార్డును నెలకొల్పిన డోనాల్డ్ ట్రంప్.. ఏంటది?

ఠాగూర్
బుధవారం, 6 నవంబరు 2024 (16:54 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అరుదైన రికార్డును నెలకొల్పారు. అమెరికా ఎన్నికల చరిత్రలో ఒక అధ్యక్షుడు ఎన్నికల్లో ఓడిపోయి, ఆ తర్వాత శ్వేతసౌథాన్ని తిరిగి గెలుచుకోవడం ఇదే రెండోసారి కావడం గమనార్హం. ఫలితంగా 131 యేళ్ల తర్వాత డోనాల్డ్ ట్రంప్ అరుదైన రికార్డు సృష్టించాడు. అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. 
 
నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు పోటీ చేసి విజయం సాధించిన వారు ఉన్నారు. కానీ, ఓసారి పదవి చేపట్టాక.. రెండోసారి ఓడిపోయి, మూడోసారి ఎన్నికల్లో గెలవడం అనేది అమెరికా ఎన్నికల చరిత్రలో ఇది రెండోసారి కావడం గమనార్హం. 
 
2020లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓడిపోయిన డోనాల్డ్ ట్రంప్... ఇపుడు ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై ఘన విజయం సాధించారు. డోనాల్డ్ ట్రంప్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినపుడు మహిళా అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై పోటీ చేసి గెలుపొందారు. ఇపుడు మహిళా అభ్యర్థి కమలా హరీస్‌పై విజయం సాధించారు. 
 
డోనాల్డ్ ట్రంప్ కంటే ముందు గ్రోవర్ క్లీవ్‌లాండ్ మాత్రమే ఇలా రెండుసార్లు అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. తొలుత 1884లో గెలిచిన ఆయన 1888లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 1892లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత ఇపుడు డోనాల్డ్ ట్రంప్ ఆ అరుదైన రికార్డును నెలకొల్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments