Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ షోకు ట్రంప్ భారీ డీల్ ఆఫర్.. రూ.67 కోట్లు ఇవ్వండి.. బెర్నీతో డిబేట్‌కు రెడీ!?

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (19:03 IST)
రిపబ్లికన్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం ఖరారుచేసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ నోరువిప్పితేనే సంచలనం. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో అందరినీ తన వైపు తిప్పుకునే డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థలకు భారీ డీల్ ఆఫర్ చేశారు. గత ఏడాది కాలంగా టెలివిజన్‌లో ట్రంప్‌ డిబేట్‌లకు రికార్డు స్థాయి వ్యూయర్‌షిప్‌ వస్తోంది.

ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం ఆశిస్తున్న బెర్నీ శాండర్స్‌తో తన చర్చ జరగాలంటే రూ.67 కోట్లు (పది మిలియన్ డాలర్లు) ఇస్తే ఓకే అన్నారట. బెర్నీ శాండర్స్‌ కూడా ట్రంప్‌తో చర్చకు సిద్ధమేనన్నారు. అయితే ట్రంప్ భారీ డీల్ ఆఫర్‌కు సదరు మీడియా సంస్థ యాజమాన్యానికి కళ్లు జిగేల్‌మన్నాయి. అలా సదరు మీడియా సంస్థ నుంచి వచ్చే డబ్బును ఛారిటీలు, ఎన్జీవోలకు విరాళంగా ఇస్తానని కూడా ట్రంప్ ప్రకటించారు.  
 
బెర్నీ శాండర్స్‌తో తన డిబేట్ అంటే ఆ టెలివిజన్‌ షోకు మంచి రేటింగ్‌ వస్తుందని.. తద్వారా మంచి కలెక్షన్స్ వస్తాయి. టెలివిజన్ ఇండస్ట్రీ వ్యాపారం గురించి తనకు బాగా తెలుసునని అందుకే భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ నార్త్‌డకోటాలోని బిస్మార్క్‌లో రిపబ్లికన్ నామినీగా తగిన ప్రతినిధుల మద్దతు సాధించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

బెర్నీతో డిబేట్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ఆ షో ద్వారా పది నుంచి పదిహేను మిలియన్‌ డాలర్లు సేకరించగలిగితే మహిళల ఆరోగ్యం, ఇతరత్రా అంశాల కోసం సహాయపడే ఛారిటీలకు ఇవ్వగలమని ట్రంప్ వ్యాఖ్యానించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments