Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం తీవ్రవాదుల వల్ల జరగరానిది జరిగితే ఆ న్యాయమూర్తిని బాధ్యుడిని చేయాలి : ట్రంప్ నిప్పులు

అమెరికా పౌరుల భద్రతను లక్ష్యంగా పెట్టుకుని ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా తాను జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్డర్స్‌పై స్టే విధించిన సియోటెల్ న్యాయమూర్తిపై అధ్యక్షుడు డ

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (11:43 IST)
అమెరికా పౌరుల భద్రతను లక్ష్యంగా పెట్టుకుని ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా తాను జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్డర్స్‌పై స్టే విధించిన సియోటెల్ న్యాయమూర్తిపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. దేశంలో జరగరానిది ఏదైనా జరిగితే ఆ న్యాయమూర్తిని, న్యాయవ్యవస్థను బాధ్యులను చేయాలంటూ వ్యాఖ్యానించారు. 
 
తాజాగా శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టు కూడా ఆయన గట్టి షాకిచ్చింది. ఇమ్మిగ్రేషన్స్ ఆర్డర్స్‌పై సియోల్ కోట్ ఇచ్చిన స్టేను తొలగించలేమని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉందని, అందువల్ల కౌంటర్ దాఖలు చేయాలంటూ ట్రంప్ సర్కారును ఆదేశించింది. ఈ ఆదేశాలతో ట్రంప్‌ షాక్‌కు గురయ్యారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ ఇమిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై స్టే విధించిన సియాటెల్ న్యాయమూర్తి రాబర్ట్ ను పిచ్చోడిగా అభివర్ణించారు. ఆ జడ్జికి పిచ్చి పట్టిందని, అందుకే ఉగ్రవాదులకు మద్దతిస్తున్నాడని, ఆయనపై కేసు పెట్టి జైల్లో పెట్టాలని నిప్పులు చెరిగారు. ఎంతో మంది చెడ్డవారిని అమెరికాకు తీసుకువచ్చి ఇక్కడి ప్రజలకు శాంతి లేకుండా చేయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని అన్నారు.
 
ఆ న్యాయమూర్తి ఆదేశాల వల్ల అమెరికా పౌరులకు జరగరానిది ఏదైనా జరిగితే ఆ న్యాయమూర్తితో పాటు.. న్యాయవ్యవస్థను బాధ్యులను చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సియోటెల్ కోర్టు రాబర్ట్ తీర్పు పట్ల ఐఎస్ఐఎస్ సహా పలు ఉగ్రవాద సంస్థలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. ఆయన తన భయంకరమైన తీర్పును సవరించుకోవాలని సలహా ఇచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments