Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగారకుడిపై కన్నేసిన డొనాల్డ్ ట్రంప్.. రూ.1.30 లక్షల కోట్లు కేటాయింపు.. ఫైలుపై సంతకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరుణగ్రహంపై కన్నేశారని తెలుస్తోంది. అరుణగ్రహం మీదకు మనుషులను పంపే నాసా ప్రాజెక్టు కోసం డొనాల్డ్ ట్రంప్ ఏకంగా రూ.1.30 లక్షల కోట్లు కేటాయించారు. 2018 సంవత్సరానికి గాను

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (09:11 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరుణగ్రహంపై కన్నేశారని తెలుస్తోంది. అరుణగ్రహం మీదకు మనుషులను పంపే నాసా ప్రాజెక్టు కోసం డొనాల్డ్ ట్రంప్ ఏకంగా రూ.1.30 లక్షల కోట్లు కేటాయించారు. 2018 సంవత్సరానికి గాను నానా ట్రాన్సిషన్ ఆథరైజేషన్ యాక్ట్ కింద ఈ నిధులు ఇచ్చారు. ఈ నిధుల ద్వారా 2030 నాటికి అంగారకుడి మీదకు మనిషి పంపాలన్నదే నాసా ఉద్దేశంతో...బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు.  
 
ఈ బిల్లుపై సంతకం చేయడంపై డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. మానవుడు అంతరిక్షాన్ని జయించాలనేదే నాసా ప్రధాన ఉద్దేశమని.. దానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడుతుందని ట్రంప్ వెల్లడించారు. ఇంత పెద్దమొత్తంలో నిధులు ఇవ్వడం వల్ల నాసాలో కొత్తగా ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు.
 
ఇదిలా ఉంటే.. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌తో కరచాలనం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిరాకరించారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలను ట్రంప్‌ ప్రతినిధి తిరస్కరించారు. మీడియా కెమెరాల ముందు కరచాలనం చేసుకుందామా అని మెర్కెల్‌ అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ వినిపించుకున్నారని నేననుకోవడం లేదు అని ఆ ప్రతినిధి సియాన్‌ స్పైసర్‌ తెలిపారు. 
 
గతవారం మెర్కెల్‌ అమెరికా పర్యటన సందర్భంగా వైట్‌హౌస్‌ ప్రవేశ ద్వారం వద్ద ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్నారు. కానీ, తర్వాత ఓవల్‌ కార్యాలయంలో ఇరువురు పక్కపక్కన కూర్చున్నపుడు మరోసారి మీడియా కోసం కరచాలనం చేసుకుందామని అని మెర్కెల్‌ అడిగిన ప్రశ్న ట్రంప్‌కు వినిపించలేదో లేక కావాలనే పట్టించుకోలేదని అని గుసగుసలు వచ్చిన సంగతి తెలిసిందే.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments