Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే భరించలేం : అమెరికాలో ఆసక్తికర చర్చ

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (16:38 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో నిలిచే అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కాగా, డమోక్రటిక్ పార్టీ తరపున హిల్లరీ క్లింటన్ తుది పోరులో తలపడే అవకాశం ఉంది. అయితే, ఈ ఇద్దరు ఎవరు బెస్ట్ అన్న అంశంపై జరిపిన సర్వే ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. 
 
నవంబరు 8న జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చాలా మంది భావిస్తున్నారు. సైద్ధాంతికంగా అమెరికన్లు రెండు వర్గాలుగా చీలిపోయారని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నవారు హిల్లరీ సిద్ధాంతాలను ఇష్టపడటం లేదు. అలాగే, హిల్లరీ మద్దతుదారులు కూడా ట్రంప్ అధ్యక్షుడైతే ప్రమాదమని భావిస్తున్నారు. 
 
హిల్లరీ కంటే డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే మరింత ప్రమాదముందని డెమోక్రటిక్ పార్టీ నేతలే కాదు... ఆ దేశ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అమెరికాలో విదేశీ ముస్లింలు ప్రవేశించకుండా తాత్కాలికంగా నిషేధం విధించాలని ఆయన అన్నారు. దేశ సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి మెక్సికో నిధులు చెల్లించేలా చేస్తానన్నారు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను పున:సమీక్షిస్తామని చెప్పారు. ఇటువంటి వ్యాఖ్యలు అమెరికాలో ఆందోళనలు రేకెత్తించాయి. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments