Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్ ఆఖరి రోజు ఎలా గడవనుంది? సంప్రదాయానికి తూట్లు!

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (06:22 IST)
అమెరికా అధ్యక్ష పదవి నుంచి డోనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో దిగిపోనున్నారు. బుధవారం మధ్యాహ్నంతో ఆయన పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఆయన మాజీ అధ్యక్షుడు కానున్నారు. అయితే, అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ఆఖరి రోజున ఘనమైన వీడ్కోలు పలకాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. 
 
ఇందుకోసం అమెరికా మిలిటరీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య రెడ్‌ కార్పెట్‌పై ట్రంప్‌ దంపతులకు ఊరేగింపు జరుగనుంది. ట్రంప్‌నకు మిలిటరీ దళాలు '21 గన్‌ సెల్యూట్' చేయనున్నాయి. అధ్యక్షుడు ప్రయాణించే ప్రత్యేక హెలికాప్టర్‌ 'మెరైన్‌ వన్'లో ట్రంప్‌ చివరిసారిగా ప్రంయాణించనున్నారు. 
 
మరోవైపు, అమెరికా అధ్యక్ష సంప్రదాయానికి డోనాల్డ్ ట్రంప్ తూట్లు పొడిచారు. కొత్తగా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే వ్యక్తికి పాత అధ్యక్షుడు స్వాగతం చెబుతూ ప్రమాణ కార్యక్రమానికి హాజరవ్వడం ఆనవాయితీ. కానీ, బైడెన్‌కు తాను స్వాగతం చెప్పే ప్రసక్తేలేదని అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. 
 
దీంతో గత 150 యేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి ట్రంప్ తూట్లు పొడిచారంటూ రాజ్యాంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. అదేసమయంలో తన ప్రమాణానికి ట్రంప్‌ హాజరుకాకపోవడమే మంచిదని బైడెన్‌ కూడా ఘాటుగానే సమాధానమిచ్చారు. కాగా 1869లో అప్పటి అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌ తన తర్వాత అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్న ఎస్‌. గ్రాంట్‌ ప్రమాణానికి హాజరుకాలేదు. ఆ తర్వాత ఇపుడు ఆ జాబితాలో డోనాల్డ్ ట్రంప్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments