Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిడేల్ కాస్ట్రో మృతిపై డోనాల్డ్ ట్రంప్‌ హర్షం ... సొంత ప్రజలను అణచివేసిన వ్యక్తి...

క్యూబా మాజీ అధినేత ఫిడెల్‌ కాస్ట్రో మరణంపై అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. సొంత ప్రజలను 60 యేళ్ళపాటు అణిచివేసిన నేత అంటూ విమర్శించారు. ఫిడేల్ క్యాస్ట్రో శనివారం కన్నుమూసిన విషయం

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2016 (09:16 IST)
క్యూబా మాజీ అధినేత ఫిడెల్‌ కాస్ట్రో మరణంపై అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. సొంత ప్రజలను 60 యేళ్ళపాటు అణిచివేసిన నేత అంటూ విమర్శించారు. ఫిడేల్ క్యాస్ట్రో శనివారం కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆరు దశాబ్దాల పాటు అమెరికాకు నిద్రలేకుండా చేసిన నేతగా క్యాస్ట్రోకు పేరుంది. ఆయన మృతిపై పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర ప్రముఖులు తమకు తోచిన రీతిలో స్పందించారు.
 
కానీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం కసిగా స్పందించారు. తొలుత.. ‘ఫిడెల్‌ కాస్ట్రో మరణించారు’ అని ఎలాంటి భావోద్వేగ ప్రకటనా లేకుండా ట్వీట్‌ చేశారు. మళ్లీ కాసేపటికి ఆయన నుంచి పూర్తి ప్రకటన విడుదలైంది. అందులో కాస్ట్రోను క్రూర నియంతగా, తన సొంత ప్రజలనే ఆరు దశాబ్దాలపాటు అణచివేసిన వ్యక్తిగా అభివర్ణించారు. 
 
అంతేనా.. క్యూబాను ఇన్నాళ్లూ నియంతృత్వంతో మగ్గిపోయిన దీవిగా పేర్కొన్నారు. ఆయన హయాంలో ప్రజలు వర్ణనాతీతమైన బాధలు అనుభవించారని, పేదరికం తాండవించిందని, పౌరులు తమ ప్రాథమిక మానవహక్కులు కోల్పోయారని.. ఇకనైనా క్యూబా ప్రజలు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలతో జీవిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి, స్వేచ్ఛ దిశగా క్యూబన్‌ ప్రజలు తమ ప్రయాణం ప్రారంభించడానికి అవసరమైన సహాయం మా యంత్రాంగం అందిస్తుంది అని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments