Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్.. ఫెంటాస్టిక్ ప్లేస్.. ఫెంటాస్టిక్ పీపుల్.. డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ :: షరీఫ్‌ ఫోన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన డొనాల్డ్‌ అధ్యక్షుడు కాగానే.. తన వైఖరి మార్చుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. నాడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్‌ అని,

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (11:00 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన డొనాల్డ్‌ అధ్యక్షుడు కాగానే.. తన వైఖరి మార్చుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. నాడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్‌ అని, దీనిని నిరోధించగలిగేది ఒక్క భారత్‌ మాత్రమేనని వ్యాఖ్యానించిన ట్రంప్.. ఇపుడు పాకిస్థాన్ అద్భుతమైన దేశంగా వ్యాఖ్యానించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. పైగా పాకిస్థానీలు అత్యంత తెలివైనవాళ్లు అంటూ సరికొత్త ట్విస్టు ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం పాకిస్థాన్‌కు సానుకూల సంకేతాలు ఇచ్చారు.
 
పాకిస్థాన్‌కు చెందిన ఏ సమస్యలైనా పరిష్కరించడానికి తాను సిద్ధమంటూ ఆ దేశ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు ఫోన్‌ చేసి షరీఫ్‌ అభినందించిన సందర్భంగా.. ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 'అపరిష్కృతంగా ఉన్న ఎలాంటి సమస్యల పరిష్కారంలోనైనా నా వంతు పాత్ర పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీనిని నేను గౌరవంగా భావించి వ్యక్తిగతంగానూ కృషి చేస్తాను. నేను అధ్యక్ష పదవి స్వీకరించే జనవరి 20లోపు కూడా కావాలంటే ఎప్పుడైనా ఫోన్‌ చేయవచ్చు' అని ట్రంప్‌ పేర్కొన్నట్టు పాక్‌ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments