Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒబామా ఆ వ్యాధితో చనిపోవాలి.. మేక్సీ అనే మగ గొరిల్లాతో మిషెల్లీ కలిసి జీవించాలి: పలాడినో

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా పైన, ఆయన సతీమణి మిషెల్లీ ఒబామాపై ప్రముఖ వ్యాపారవేత్త, రిపబ్లికన్ పార్టీ నేత 70 ఏళ్ళ కార్ల్ పలాడినో నోరు పారేసుకున్నాడు. అమెరికా పీఠాన్ని అధిరోహించనున్న ట్రంప్‌క

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (17:38 IST)
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా పైన, ఆయన సతీమణి మిషెల్లీ ఒబామాపై ప్రముఖ వ్యాపారవేత్త, రిపబ్లికన్ పార్టీ నేత 70 ఏళ్ళ కార్ల్ పలాడినో నోరు పారేసుకున్నాడు. అమెరికా పీఠాన్ని అధిరోహించనున్న ట్రంప్‌కు సరైన మద్దతుదారుడని నిరూపించాడు. దూకుడుగా వ్యవహరించడం, నోటికొచ్చినట్లు మాట్లాడటంలో దిట్ట అయిన ట్రంప్ రోగం.. పలాడినోకు సోకినట్లుంది. 
 
పలాడినోకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మూడో కొడుకు పాట్రిక్ 2009లో జరిగిన ఓ యాక్సిడెంట్‌లో మరణించాడు. ఓ మహిళా ఉద్యోగినితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఫలితంగా పలాడినో ఓ కూతురికి తండ్రి కూడా అయ్యాడు. ఇప్పుడామె టీనేజర్. అందుకే ఒబామా దంపతులకు విమర్శనాస్త్రాలను సంధించాడు. 
 
వచ్చే కొత్త సంవత్సరంలో ఒబామా.. ఆవులకు వచ్చే అరుదైన వ్యాధితో మరణించాలని, మిషెల్లీ ఆఫ్రికాలోని జింబాబ్వేలో గల గుహల్లో మేక్సీ అనే మగ గొరిల్లాతో కలిసి జీవించాలని కోరుకుంటున్నానని పలాడినో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు తానే చేశానని కూడా స్వయంగా ఒప్పుకున్నాడు. 
 
2010లో న్యూయార్క్ గవర్నర్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన పలాడినో.. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఆయనకు మద్దతుగా విస్తృత ప్రచారం చేశాడు.  కాగా.. ఒబామాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఇతనిపై అనేకమంది మండిపడుతున్నారు. తన కామెంట్స్‌ను ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments