Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి వీసా నిరాకరించామా? రెడ్ కార్పెట్ రెడీ ఫర్ మోడీ: జాన్ కెర్రీ!

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (14:35 IST)
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వీసా నిరాకరించలేదని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ తెలిపారు. మోడీకి వీసా నిరాకరించింది వేరే ప్రభుత్వమని.. తమ ప్రభుత్వం ఆయనకు రెడ్ కార్పెట్ పరుస్తుందని జాన్ కెర్రీ అన్నారు. మోడీకి సాదర స్వాగతంలో పాటు వీసాను ఇస్తామన్నారు. భారత్‌లో పర్యటిస్తున్న ఆయన గురువారం ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ ప్రిట్జర్‌తో కలిసి ఓ న్యూస్‌ చానెల్‌తో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. 
 
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించే దిశగా తమవంతు సహకారం అందిస్తామన్నారు. న్యూక్లియర్‌ సప్లయర్‌ గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు చోటు దక్కే విషయంలోనూ సహకరిస్తామన్నారు. భారత్‌తో కలిసి ముందడుగు వేసేందుకే తమ ప్రభుత్వం నిశ్చయించిందని స్పష్టం చేశారు. బీజేపీ నేతల ఇళ్లపై అమెరికా నిఘా పెట్టిన అంశంపై స్పందించిన ఆయన, గూఢచర్యానికి సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని అమెరికా విధానమన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments