Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిలో కరోనా కొత్త వేరియంట్.. అలెర్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (08:40 IST)
గత 2019 డిసెంబరు నెలలో చైనాలోని వ్యూహాన్ నగరంలో వెలుగు చూసి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది అనేక లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఈ వైరస్ కొత్త కొత్త రూపాలను సంతరించుకుంటూ భయపెడుతూనే ఉంది. తాజాగా ఈ వైరస్‌ను నీటిలో గుర్తించారు. నీటిలో కొత్త వేరియంట్ కోవిడ్ వైరస్ ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ నెలలో బీఏ 2.86 అనే వేరియంట్‌ను గుర్తించినట్టు పేర్కొంది. నీటి నమూనాల్లో దీన్ని గుర్తించినట్టు పరిశోధకులు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
 
రెండేళ్లపాటు యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ కరోనా. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా అంతరించిపోలేదన్న వాస్తవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) తన నివేదిక ద్వారా వెల్లడించింది. పైగా అది రూపం మార్చుకుని వ్యాపిస్తోందని తెలిపింది. 
 
గతంలో గాలి ద్వారా వ్యాపించిన కరోనా వైరస్ రకాలు... ఇప్పుడు ఉత్పరివర్తనాల కారణంగా నీటి ద్వారానూ వ్యాపిస్తున్నాయని డబ్ల్యూహెచ్ హెచ్చరించింది. గత నెలలో 9 రకాల కరోనా వేరియంట్లను గుర్తించగా, ఈ నెలలో కరోనా బీఏ 2.86ను గుర్తించారు. ఇది నీటిలో కనిపించడంతో డబ్ల్యూహెచీ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. 
 
ఇప్పటివరకు దీని కారణంగా మరణాలు సంభవించినట్టు ఎక్కడా వెల్లడి కాలేదని, కానీ దీనిపై పూర్తి స్థాయి పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచీ స్పష్టం చేసింది. ఈ బీఏ 2.86 వేరియంట్ స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్ దేశాల్లో గుర్తించినట్టు వివరించింది. కాగా, భారత్‌లోనూ మళ్లీ కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించడంతో కేంద్రం సమీక్ష సమావేశం నిర్వహించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments