Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుందర్ పిచాయ్‌కి పద్మభూషణ్.. భారత్ నా శరీరంలో అంతర్భాగం

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (14:01 IST)
Sundar pichai
భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్‌కు ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డు లభించింది. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబారి నుంచి సుందర్ పిచాయ్ శుక్రవారం ఈ పురస్కారం అందుకున్నారు. 
 
2022 ఏడాదికి గానూ సుందర్ పిచాయ్‌కి పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించగా, అమెరికాలోని భారత రాయబారి నుంచి సుందర్ పిచాయ్ శుక్రవారం ఈ పురస్కారం అందుకున్నారు. 
 
ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. భారతదేశం తన శరీరంలో అంతర్భాగమన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తన వెంట భారతదేశాన్ని తీసుకెళ్తానని చెప్పారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 
 
ఈ సందర్భంగా భారత సర్కారుకు, దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేగాకుండా తన తల్లిదండ్రులకు, తన ఎదుగుదలకు సాయపడిన వారిని గుర్తు చేసుకున్నారు.  
 
కాగా మదురై నుండి మౌంటెన్ వ్యూ వరకు సుందర్ పిచాయ్ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, భారతదేశం-అమెరికా ఆర్థిక- సాంకేతికతను బలోపేతం చేసిందని.. విదేశాంగ శాఖ అధికారి తరంజిత్ ఎస్ సంధు అన్నారు. సుందర్ పిచాయ్‌కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments