Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిమ్స్ 'గే' డాక్టర్ ఉదంతం.. భార్య సూసైడ్ నోట్.. ఫేస్‌బుక్ రికార్డ్..!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (11:20 IST)
ఢిల్లీలోని ప్రముఖ ఆస్పత్రి ఎయిమ్స్‌లో పని చేస్తున్న స్వలింగ సంపర్కుడైన డాక్టర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న భార్య ఉదంతం సామాజిక మాధ్యమాల్లో రికార్డ్ సృష్టించింది. ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను ఫేస్‌బుక్‌లో 3,500 సార్లు షేర్ చేశారు. ఆమెకు పెద్ద సంఖ్యలో నివాళిలు తెలిపారు.
 
కాగా ఎయిమ్స్‌లో అసస్థీషియా స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న ప్రియకు, డెర్మటాలజిస్ట్‌గా పనిచేస్తున్న కమల్‌కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు దక్షిణ ఢిల్లీలోని ఎయిమ్స్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. 
 
ఈ స్థితిలో సెంట్ర ఢిల్లీలోని ఒక హోటల్లో భర్తతో కసిలి బసచేసిన ప్రియ శనివారం రాత్రి మణికట్టును కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల దర్యాప్తులో ఆమే రాసిన సుసైడ్ నోట్ చిక్కింది. అందులో 'వీడు పెడుతున్న అపరిమితమైన మానసిక హింసను తట్టుకోలేకనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నాను' అంటూ రాసింది. 
 
పెళ్లయిన తరువాత కమల్ నపుంసకుడని తెలిసినా సర్దుకుపోయానని, కానీ, పరిస్థితిని తాను చనిపోయేవరకూ తీసుకువచ్చాడని సుదీర్ఘ లేఖ రాసింది. తాను 'గే' నన్న విషయాన్ని కమల్ దాచిపెట్టాడని, కట్నం కోసం వేధించాడని ఆమె లేఖలో ఆరోపించింది.
 
ఆమె చనిపోయే ముందు ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెడుతూ "నేను నీతోనే ఉండాలని అనుకున్నాను. ఎందుకంటే నేను నిన్ను ఎంతో ప్రేమించాను కాబట్టి. నీ లోపాన్ని కూడా భరించాను. కానీ, నువ్వు నా జీవితానికి ఓ క్రిమినల్‌గా మారావు. నీ కుటుంబానికి ఈ విషయాలు తెలీవు. నువ్వో దయ్యానివి" అని పేర్కొంది.
 
కాగా అదే రోజు కమల్ తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఆమె కోసం వెతికిన పోలీసులకు మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఆమె రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి డాక్టర్‌ను అరెస్టు చేసి, విచారిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments