Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావూద్ ఇబ్రహీంకు కరోనా.. అండర్ వరల్డ్ డాన్ మృతి చెందాడా?

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (17:58 IST)
గత 1993వ సంవత్సరం ముంబై బాంబు పేలుళ్లకు కారణమైన దావూద్ ఇబ్రహీంకు కరోనా పాజిటివ్ అని తేలింది. వందలాది మంది ప్రాణాలను బలిగొన్న 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్‌ ఇబ్రహీం ప్రధాని నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి బయటి ప్రపంచానికి కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నాడు.
 
ఈ నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే దావూద్ సతీమణి షెరీన్‌కు కూడా కరోనా పాజిటివ్‌ను ధ్రువీకరించిన తరుణంలో.. వారి ఇంట్లో పని మనిషులను క్వారంటైన్‌లో వుంచినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు మోస్ట్‌ వాటెండ్‌ అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కరోనా వైరస్‌తో మృతి చెందాడనే వార్తలు సోషల్‌ మీడియాలో షికారు చేస్తున్నాయి. మిలిటరీ ఆస్పత్రిలో కరోనా బారిన పడి ఆయన మృతి చెందాడని పాకిస్తాన్‌కు చెందిన న్యూస్‌ ఎక్స్‌ మీడియా సంస్థ శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. వైరస్‌ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దావూద్‌ మృతి చెందాడని పేర్కొంది. 
 
ఈ వార్త కాస్తా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌‌ అవుతోంది.  దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విపరీతంగా కామెంట్స్‌ పెడుతున్నారు. భారత్‌తో సహా ప్రపంచ దేశాలు చేయలేని పనిని కరోనా వైరస్‌ చేసిందని వ్యంగ్యంగా పోస్ట్‌ చేస్తున్నారు. అయితే దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం మాత్రం సోదరుడు మరణవార్తల్లో నిజం లేదని కొట్టిపారేస్తున్నాడు. దావూద్ ఫ్యామిలీ సేఫ్‌గా వుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంటలిజెన్స్ వర్గాలు మాత్రం దావూద్ కోవిడ్ సోకడంతో క్వారంటైన్‌లో వున్నారని చెప్తున్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments