Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యుపర్టినో పట్టణ తొలి మహిళా మేయర్‌గా భారత సంతతి మహిళ

అమెరికాలో మరో భారత సంతతి మహిళ విజయకేతనం ఎగురవేసింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న క్యుపర్టినో పట్టణ మేయర్‌గా సవితా వైద్యనాథన్‌ ఎంపికయ్యారు. ఒక భారత సంతతి మహిళ ఈ పట్టణానికి మేయర్‌గా ఎన్నిక

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (13:51 IST)
అమెరికాలో మరో భారత సంతతి మహిళ విజయకేతనం ఎగురవేసింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న క్యుపర్టినో పట్టణ మేయర్‌గా సవితా వైద్యనాథన్‌ ఎంపికయ్యారు. ఒక భారత సంతతి మహిళ ఈ పట్టణానికి మేయర్‌గా ఎన్నిక కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ ఈ పట్టణ మేయర్‌గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తన జీవితంలో అద్భుతమైన క్షణాలు ఇవేనంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందిన చిన్నపట్టణాల్లో క్యుపర్టినో ప్రముఖమైనది. యాపిల్‌ సంస్థ ప్రధాన కార్యాలయం క్యుపర్టినోలో ఉండటంతో ఈ ప్రాంతం బాగా ప్రాచుర్యం పొందింది. 
 
కాగా, సవితా వైద్యనాథన్ గత 19 యేళ్లుగా క్యుపర్టినోలో నివసిస్తున్నారు. ఈమె అక్కడి పలు కమ్యూనిటీలు నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన సేవలు అందిస్తున్నారు. ఎంబీఏ చదివిన ఆమె హైస్కూల్‌ మ్యాథ్స్‌ టీచరుగా, కమర్షియల్‌ బ్యాంకులో అధికారిగా పనిచేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments