Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవిడ్‌ కొత్త లక్షణాలు

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (16:35 IST)
కొత్త కొవిడ్‌ స్ట్రెయిన్‌ కొత్త రకం లక్షణాలతో విజృంభిస్తోంది. బ్రెజిలియన్‌, కెంట్‌ కొవిడ్‌ వేరియెంట్లతో కలిగే ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు తీవ్రంగా, భిన్నంగా ఉంటున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో కనిపిస్తున్న లక్షణాలు, పూర్వపు కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలకు భిన్నంగా ఉంటున్నాయి.

గుజరాత్‌లోని కొవిడ్‌ బాధితుల్లో కడుపునొప్పి, తలతిరుగుడు, వాంతులు, జలుబు వంటివి కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లోని కొవిడ్‌ బాధితుల్లో కీళ్ల నొప్పులు, మయాల్జియా, జీర్ణసంబంధ సమస్యలు,  ఆకలి కోల్పోవడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు.  అందుకే వైద్యులు ఏ కొత్త లక్షణం కనిపించినా కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.  
 
పింక్‌ ఐస్‌: కనుగుడ్డులోని ఆక్యులర్‌ మ్యూకస్‌ మెంబ్రేన్‌ ద్వారా కొవిడ్‌ వైరస్‌ శరీరంలోకి చేరే అవకాశం ఉంటుంది. అప్పుడు కళ్లు ఎర్రబడి, నీరు కారే పింక్‌ ఐస్‌ లక్షణం కనిపిస్తుంది. కళ్లకలకను తలపించే ఈ లక్షణానికి కొవిడ్‌ పరీక్షతో కారణాన్ని నిర్థారించుకోవడం అవసరం. 
 
వినికిడి లోపం: ఒకటి లేదా రెండు చెవుల్లో గంట మోగుతున్న శబ్దం వినిపించడం టిన్నిటస్‌ అనే చెవి సమస్య లక్షణం. కొందరు కొవిడ్‌ బాధితుల్లో ఇదే లక్షణం కనిపిస్తోంది.  
 
జీర్ణసంబంధ సమస్యలు: డయేరియాలో కనిపించే వాంతులు, విరేచనాలు కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌లోనూ బయల్పడుతున్నాయి. ఊపిరితిత్తుల మీద దాడి చేసే కొవిడ్‌  వైరస్‌ మూత్రపిండాలు, కాలేయం, జీర్ణవ్యవస్థల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. విరేచనాలు లాంటి లక్షణాలను కూడా కొవిడ్‌ లక్షణాలుగానే అనుమానించాలి.
 
విపరీతమైన నీరసం: కొవిడ్‌ వైరస్‌ మూలంగా శరీరంలో జరిగే సైటోకైన్స్‌ రియాక్షన్‌తో విపరీతమైన బడలిక, నీరసం ఆవరిస్తాయి. తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ సమయాల్లో  ఈ సైటోకైన్స్‌ వెనువెంటనే ఇన్‌ఫెక్షన్‌తో పోరాటానికి దిగుతాయి. ఆ సమయంలో విపరీతమైన నిస్సత్తువ ఆవరిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments