Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛీ..ఛీ.. ఏంటా పాడుపని, విమానం నుంచి ప్రేమికులను తోసేసిన ఎయిర్ లైన్స్ సిబ్బంది...

ప్రేమికులు అంటే వారి వ్యవహారం ఎలా వుంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు కదా. ఇటీవలి కాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటూ నానా రచ్చ రచ్చ అవుతున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ సంస్థ మరో వివాదానికి తెరతీసింది. మొన్నీమధ్యనే విమానంలో వున్న డాక్టరుని రక్తం వచ్చేట్లు చా

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (12:04 IST)
ప్రేమికులు అంటే వారి వ్యవహారం ఎలా వుంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు కదా. ఇటీవలి కాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటూ నానా రచ్చ రచ్చ అవుతున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ సంస్థ మరో వివాదానికి తెరతీసింది. మొన్నీమధ్యనే విమానంలో వున్న డాక్టరుని రక్తం వచ్చేట్లు చావబాది విమానం నుంచి కిందికి ఈడ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపధ్యంలో ఎయిర్ లైన్స్ కొన్ని నిబంధనలను పెట్టింది. ఐతే వాటిని సదరు ఎయిర్ లైన్స్ సిబ్బంది ఎంతమాత్రం పట్టించుకోవడంలేదనేందుకు తాజాగా మరో నిదర్శనం వెలుగుచూసింది. 
 
ఎంగేజ్‌మెంట్ పూర్తయి త్వరలో వివాహం చేసుకోనున్న ఓ జంట హ్యూస్టన్ నుంచి టెక్సాస్‌కు వెళ్లేందుకు విమానం ఎక్కారు. ఐతే వారికి విమానం మధ్యలో సీట్లు కేటాయించగా వాటిని వదిలేసి వెనుక సీట్లో సెటిలయ్యారు. అక్కడ ఇద్దరూ ముద్దులు, కౌగిలింతలు.... ఇంకా ఏవేవో పనులతో ఓవరయ్యారట. దీంతో చిర్రెత్తిపోయిన సిబ్బంది వారిని విమానం నుంచి కిందికి దింపేశారు. 
 
ఐతే ప్రేమికులు మాత్రం మరోలా చెపుతున్నారు. తమకు కేటాయించిన సీట్లలో కూర్చొనివ్వకుండా వెనక్కి నెట్టేశారనీ, అదేమని అడిగితే తమను విమానం నుంచి కిందికి దించేశారంటూ వారు వాపోతున్నారు. ఈ ఘటనపై మరోసారి ఎయిర్ లైన్స్ అధికారులు విచారణకు ఆదేశించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments