Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. ముమ్మాటికీ మ్యాన్ మేడ్ .. చైనా వైరాలిజస్టు

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (08:12 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న సూక్ష్మక్రిమి కరోనా వైరస్ గురించి చైనాకు చెందిన వైరాలజిస్టు డాక్టర్ లీ మెగ్ యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్ మమ్మాటికీ మ్యాన్ మేడేనని, అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన ప్రకటించారు. పైగా, ఈ వైరస్ గురించి తాను పదేపదే హెచ్చరికలు చేసినా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు.. చైనాలు ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన తాజాగా ఆరోపించారు. 
 
హాంకాంగ్‌ లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పనిచేస్తున్న లీ మెగ్ యాన్... కరోనా వైరస్‌పై పరిశోధన చేస్తున్నారు. తాను న్యూమోనియాపై పరిశోధనలు చేస్తున్న సమయంలోనే ఈ వైరస్‌ చైనాలోని ఓ ల్యాబ్‌లో తయారైనట్టు గుర్తించినట్టు తెలిపారు. ఆ ల్యాబ్ పూర్తిగా చైనా ప్రభుత్వ అధీనంలో ఉంటుందని తెలిపారు. 
 
కరోనా వైరస్‌పై తాను చేసిన హెచ్చరికలను చైనా కానీ, ప్రపంచ ఆరోగ్య  సంస్థ కానీ పట్టించుకోలేదని లీ ఆవేదన వ్యక్తం చేశారు. తన హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పుడీ పరిస్థితి దాపురించిందన్నారు. కరోనా వైరస్ చైనా ల్యాబ్‌లోనే పుట్టిందని చెప్పేందుకు తగిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన ప్రకటించారు.
 
అప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నట్టు తెలిపారు. పైగ తన గురించి దుష్ప్రచారం మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకనే తాను చైనా నుంచి అమెరికాకు వచ్చేసినట్టు చెప్పారు. తన సమాచారం మొత్తాన్ని డిలీట్ చేశారని తెలిపారు.అయితే, లీ ఆరోపణలను వూహాన్‌లోని వైరాలజీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ యువాన్ జిమింగ్ కొట్టిపడేశారు. ఓదో పబ్లిసిటీ స్టంట్ అంటూ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments