Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలంబియా విమాన ప్రమాదం... ఫుట్‌బాల్ జట్టు క్రీడాకారులతో సహా 81 మంది మృతి

బ్రెజిల్‌లో విషాదం నెలకొంది. ఆ దేశానికి ఓ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన క్రీడాకారులంతా చనిపోయారు. బ్రెజిల్ నుంచి బయలుదేరిన ఈ విమానం కొలంబియా శివారు ప్రాంతంలోని పర్వతశ్రేణుల్లో కూలిపోవడంతో ఈ విషాదం చోటుచేసు

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (12:29 IST)
బ్రెజిల్‌లో విషాదం నెలకొంది. ఆ దేశానికి ఓ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన క్రీడాకారులంతా చనిపోయారు. బ్రెజిల్ నుంచి బయలుదేరిన ఈ విమానం కొలంబియా శివారు ప్రాంతంలోని పర్వతశ్రేణుల్లో కూలిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇందులో ఓ ఫుట్‌బాల్ జట్టు క్రీడాకారులతో పాటు.. మొత్తం 81 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా మృత్యువాతపడినట్టు భావిస్తున్నారు.
 
మొత్తం 81 మందితో వెళుతున్న సీపీ 2933 అనే ఈ చార్టెడ్‌ విమానం కొలంబియా నగరం వెలుపల ఉన్న పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. ఈ 81 మందిలోనే బ్రెజిల్‌‌లోని చాపెకోఎన్సో ఫుట్‌‌బాల్‌ అసోసియేషన్ అనే ఓ క్లబ్బుకు చెందిన ఫుట్‌ బాల్ క్రీడాకారులు ఉన్నారు. ఈ విమానం కొలంబియాలోని మెడిలిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది.
 
బొలివియా నుంచి బయలు దేరిన ఈ విమానం కొలంబియా చేరుకునే సమయంలోనే రాడార్‌ నుంచి నుంచి తప్పిపోయిందని, ఆ తర్వాతే అది నగరం శివారు ప్రాంతాల్లోని పెద్ద పర్వాతాల్లో కూలిపోయినట్లు గుర్తించినట్లు మెడిలిన్‌ ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది ట్విట్టర్‌ ద్వారా చెప్పారు.
 
కొలంబియాలో జరుగుతున్న కోపా సుడామెరికా ఫైనల్స్‌లో పాల్గొనేందుకు వీరంతా బయలు దేరినట్లు తెలిసింది. ఎంతమంది చనిపోయి ఉంటారనే విషయంపై స్పష్టత లేదు. బ్రెజిల్‌ కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి తర్వాత ఈ విమానం కూలిపోయింది. ఇంధనం లేక విమానం ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments