Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడేళ్లు సహజీవనం.. విసిగి వదిలేశా... లూబిడ్జ్ ప్రేయసి..! 'బ్లిండ్' పత్రిక వెల్లడి..!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (14:12 IST)
ఏడేళ్లు సహజీవనం చేసి, పెళ్లికి సిద్ధమైనా, అతని ప్రవర్తనతో విసిగి వదిలేశానని జర్మనీ విమానాన్ని ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో ఉద్దేశపూర్వకంగా కూల్చేసిన కో పైలెట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ శుక్రవారం రాత్రి జర్మన్ పత్రిక 'బ్లిండ్'కు తెలియజేసింది. చట్ట నిబంధనల మేరకు ఆమె పేరును, పూర్తి వివరాలను ఆ పత్రిక వెల్లడించలేదు. 
 
అతని ప్రవర్తన సక్రమంగా ఉండేది కాదని, రాత్రిళ్లు పీడకలలు భయపెట్టినట్టుగా హులిక్కిపడి నిద్రలేచి 'పడిపోతున్నాం... కిందకు పడిపోతున్నాం' అంటూ అరిచేవాడని ఆమె చెప్పారు. విమానం కూలిపోయిన వార్త తెలిసేంతవరకు అతని మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కాలేదని ఆమె అన్నారు. 
 
తాను మానసిక వ్యాధితో బాధ పడుతున్నట్టు లూబిడ్జ్ తనకు ఎన్నడూ చెప్పలేదని తెలిపింది. డసెల్‌డార్ఫ్ శివారులోని ఓ ఇంట్లో లూబిడ్జ్‌తో కలిసి ఏడేళ్లపాటు సహజీవనం చేసి, వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ, అతని ప్రవర్తన కారణంగా విడిపోయినట్లు తెలిపింది.
 
కాగా లూబిడ్జ్ ప్రవర్తన గురించి క్షున్నంగా తెలుసుకునేందుకు అతని గర్ల్ ఫ్రెండ్‌ను జర్మనీ పోలీసులు సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మరిన్ని వివరాలు వెలుగులోకి రావచ్చునని పోలీసులు అనుకుంటున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments