Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా భయం లేకుంటే భారత్‌ను పాకిస్థాన్ నాశనం చేసేది!

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (10:23 IST)
అమెరికా అనే భయం లేకుండా ఉండివుంటే భారత్‌ను పాకిస్థాన్ ఎపుడో నాశనం చేసివుండేదని అమెరికాకు చెందిన నిఘా సంస్థ సీఐఏ నివేదికలోని పత్రాలు వెల్లడిస్తున్నాయి. భారత్‌పై దాడులు కొనసాగిస్తే పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశాల జాబితాలో ఉంచుతామని, తామిచ్చే నిధులను నిలిపివేస్తామని అమెరికా గతంలో హెచ్చరికలు చేసింది. దీంతో భారత్‌పై దాడి చేసే సాహసం పాకిస్థాన్ చేయడం లేదని ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి. 
 
వాస్తవానికి భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న విషయంతెల్సిందే. ముఖ్యంగా భారత్‌పై దాడులు చేసే ఉగ్రవాద సంస్థలకు తమ గడ్డపై ఆశ్రయం కల్పిస్తూ నిధులు సమకూర్చుతోంది. గతంలో జరిగిన అనేక దాడుల్లోనూ పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు తేలింది కూడా. ఈ నిధులను పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అందజేస్తోంది. వీటికి సంబంధించిన పక్కా ఆధారాలను అమెరికా సంపాదించింది. 
 
అయితే, పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోని పక్షంలో ఉగ్ర దేశాల జాబితాలో చేరుస్తామని యూఎస్ హెచ్చరించింది. దీంతో పాక్ కాస్తంత వెనకడుగు వేసింది. భారత్ నుంచి వెళ్లే విమానాలపైనా దాడులు చేసేందుకు పాక్ కుట్ర చేసినట్టు సీఐఏ పత్రాలు తెలియజేస్తున్నాయి. అమెరికా నుంచి వచ్చే నిధులు ఆగుతాయన్న భయాలే లేకుంటే, పాక్ ఏనాడో పెను విధ్వంసానికి కారణమై ఉండేదని సీఐఏ పత్రాలు వెల్లడిస్తున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments