Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భవతి అయితే 'పట్టా' ఇవ్వరా... హక్కుల సంఘాల నిరసన

ఓ విద్యార్థిని గర్భవతి అయిన కారణంగా స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొననివ్వకుండా నిషేధించారు. దీనికి నిరసనగా ఆ విద్యార్థిని తల్లిదండ్రులు సహా పలు హక్కుల సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఎంత రాద్ధాంతం చేసినా సర

Webdunia
గురువారం, 25 మే 2017 (12:22 IST)
ఓ విద్యార్థిని గర్భవతి అయిన కారణంగా స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొననివ్వకుండా నిషేధించారు. దీనికి నిరసనగా ఆ విద్యార్థిని తల్లిదండ్రులు సహా పలు హక్కుల సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఎంత రాద్ధాంతం చేసినా సరే ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఆ విశ్వవిద్యాలయం భీష్మించుక్కూర్చుంది. వివరాల్లోకి వెళ్తే...
 
18 ఏళ్ల వయస్సు ఉన్న మ్యాడీ రంక్లెస్ అనే విద్యార్థిని లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం, గర్భందాల్చడం వంటి చర్యల ద్వారా పాఠశాల విధివిధానాలను ఉల్లంఘించిందని ఆమెను పాఠశాలకు రానివ్వకుండా బహిష్కరించేందుకు సిద్ధమైంది మేరీల్యాండ్ హాజర్స్‌టౌన్‌లోని హెరిటేజ్‌ అకాడమీ. కానీ ఆమె తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరీశీలించి పాఠశాలకు రానిచ్చినా, స్నాతకోత్సవ వేడుకల్లో తన డిప్లొమా పట్టాని మాత్రం అందించమని తెగేసి చెప్పింది. 
 
పెళ్లిపీటలపై తాళి కట్టించుకుని, వివాహ దుస్తుల్లోనే నేరుగా పరీక్షా హాలుకి వెళ్లి వస్తున్న నవ వధువులను చూడటం, సరైన అవగాహన లేకపోవడం, అధికారుల పర్యవేక్షణా లోపాల వల్ల బాల్యవివాహాలకు బలై గర్భిణిగానో, పిల్లల తల్లిగానో మారిన విద్యార్థుల పసిమొహాలను చూడటం అలవాటైన మనకు ఇది పెద్ద వింతకాకున్నా.. కేవలం గర్భవతి అన్న కారణంతో 18 ఏళ్ల అమ్మాయిని ఈ విధంగా బహిష్కరించడం మాత్రం అమెరికా దేశస్థులకు వింతగానే ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం