Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలూచిస్థాన్ లాస్‌బెలాలో కూలిన హెలికాఫ్టర్ - ఆరుగురి దుర్మరణం

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (07:53 IST)
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ లాస్‌బెలాలో ఆ దేశ ఆర్మీ ఏవియేషన్ హెలికాఫ్టర్ ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై ఆరుగురు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్థాన్‌లో వరద సహాయక చర్యల్లో నిమగ్నమైవుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
హెలికాఫ్టర్ అదృశ్యమైనపుడు బలూచిస్థాన్ లాస్‌బెలాలో వరద సహాయక కార్యక్రమాల్లో ఉందని, ఆ సమయంలో హెలికాఫ్టరులో ఉన్న ఆరుగురు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల్లో కార్ప్స్ కమాండర్‌ 12తో పాటు ఆరుగురు ఉన్నారని, తెలిపారు. ఈ హెలికాఫ్టర్ విందర్ సాసి పన్ను మందిరం మధ్య హెలికాఫ్టర్ కూలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 
 
అయితే, ఈ హెలికాఫ్టర్ కూలిపోయి ప్రాణనష్టం జరిగిందన్న వార్తలను పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్ నిర్ధారించలేదు. ఈ హెలికాఫ్టర్ వరద సహాయక చర్యల్లో ఉండగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయినట్టు పాకిస్థాన్ ఆర్మీ మాత్రం ఓ ట్వీట్ చేసింది. ఈ కూలిపోయిన హెలికాఫ్టర్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments