Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ స్టైల్‌లో పెళ్లి.. దారిలో ఉన్నారని.. వివాహతంతు ముగించేశాడు.. కానీ జైలుకెళ్లాడు..

సినీ స్టైల్‌లో పెళ్లి చేసుకున్నాడు. అయితే అతనికి జైలు తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన వాంగ్ అనే యువకుడు ప్రియురాలిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు ఆమ

Webdunia
బుధవారం, 3 మే 2017 (10:21 IST)
సినీ స్టైల్‌లో పెళ్లి చేసుకున్నాడు. అయితే అతనికి జైలు తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన వాంగ్ అనే యువకుడు ప్రియురాలిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు ఆమె తల్లిదండ్రులు ఏమాత్రం ఒప్పుకోలేదు. ప్రియురాలు కూడా వాంగ్ తల్లిదండ్రుల అంగీకారంతోనే తన పెళ్లి జరగాలని తేల్చేసింది.
 
దీంతో తన తల్లిదండ్రులను ఒప్పించే పూచీ తనదని, తమ వివాహ సమయానికి తీసుకొస్తానని ఆమెకు సర్ది చెప్పి, ఆమెను వివాహానికి ఒప్పించాడు. దీంతో వివాహ ముహూర్తం సమీపించింది. కళ్యాణ మంటపంలో 200 మంది బంధువులు, స్నేహితులు సందడి చేశారు. అయినప్పటికీ వధువు తన అత్తమామలు కనిపించడం లేదంటూ వరుడిని నిలదీసింది. దారిలో ఉన్నారని నమ్మబలికాడు. వివాహతంతు పూర్తయ్యింది. 
 
ఇంతలో వధువు సోదరికి సరికొత్త విషయం తెలియవచ్చింది. వారి వివాహానికి వచ్చినవారంతా వాంగ్‌కు బంధువులు కారని.. డబ్బులిచ్చి వారిని స్నేహితులుగా, బంధువులుగా హాజరయ్యేలా వాంగ్ చేశాడని తేలింది. దీంతో వధువుతో పాటు ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిని జైలు తప్పలేదు. తమ వివాహానికి తన తల్లిదండ్రులు అంగీకరించలేదని, అందుకే ప్రియురాలి కోసం ఇలా చేయాల్సి వచ్చిందని వాంగ్ వాపోయాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments