Webdunia - Bharat's app for daily news and videos

Install App

1646లో నీటిపాలబడి, 2017లో బయటపడిన అపార సంపద: చైనా పంట పండిందా?

దాదాపు 300 సంవత్సరాల క్రితం నీటిపాలైన అపార సంపదను చైనా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిధిలో 10వేలకు పైగా వెండి, బంగారు వస్తువులున్నాయని చెప్పారు. నైరుతి చైనాలోని సిచువాన్‌ ప్రావియెన్స్‌ సమీపంలోని నదిలో ఈ నిధిని గుర్తించామన్నారు.

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (07:30 IST)
దాదాపు 300 సంవత్సరాల క్రితం నీటిపాలైన అపార సంపదను చైనా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిధిలో 10వేలకు పైగా వెండి, బంగారు వస్తువులున్నాయని చెప్పారు. నైరుతి చైనాలోని సిచువాన్‌ ప్రావియెన్స్‌ సమీపంలోని నదిలో ఈ నిధిని గుర్తించామన్నారు. ఇందులో ఎక్కువగా నాణేలు, నగలు ఉన్నాయని, వీటితోపాటు కంచు, ఇనుముతో చేసిన కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయని చెప్పారు. మిన్‌జియాంగ్‌ నదికి ఉపనదిగా పిలిచే జిన్‌జియాంగ్‌ నది గర్భంలో ఈ సంపద బయటపడిందని సిచువాన్‌ ప్రావిన్షియల్‌ కల్చరల్‌ రెలిక్స్‌ అండ్‌ అర్కియాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ గావో డాలన్‌ తెలిపారు.
 
1646లో ఈ ప్రాంతాన్ని పాలించిన ఝాంగ్‌ జియాంఝాంగ్‌... మింగ్‌ సైన్యానికి భయపడి సంపదను వెయ్యి పడవల్లో మరోచోటుకు తరలిస్తుండగా అందులో కొన్ని పడవలు నీటిలో మునిగిపోయాయని, ఆ సంపదే ఇప్పుడు బయట పడిందన్నారు. సాధారణంగా వేసవి సమీపించడంతో నదీ పరిసర ప్రాంతాల్లో పురాతత్వశాస్త్రవేత్తలు తవ్వకాలను ప్రారంభిస్తారు. ఈ ఏడాది కూడా తవ్వకాలు మొదలు పెట్టడడంతో ఈ నిధి బయటపడింది.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments